Bandla ganesh: పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లపై.. సంచలన నిజాలను బయటపెట్టిన బండ్ల గణేష్

ఎప్పుడు వార్తల్లో నిలిచే పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల న్యూస్ మరోసారి జనాల్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈసారి పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల వార్త హాట్ టాపిక్ గా మారడానికి ఒక కారణం ఏపీ సియం జగన్ మోహన్ రెడ్డి అయితే మరో కారణం పవన్ కళ్యాణ్ వీరాభిమాని బండ్ల గణేష్.

సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా పలు భారీ బడ్జెట్ సినిమాలు నిర్మించిన బండ్ల గణేష్ ప్రస్తుతం సినిమాలేవి చేయడం లేదు. 2015 లో ఎన్టీఆర్ తో టెంపర్ సినిమాను నిర్మించిన బండ్ల గణేష్ ఆ తరువాత సినిమాల నుంచి బ్రేక్ తీసుకొని ప్రస్తుతం వ్యాపారాలలో బిజీ గా ఉంటున్నాడు. అయితే బండ్ల గణేష్ సినిమాలకు దూరంగా ఉంటున్నప్పటికీ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ.. ఏపీ తెలంగాణ రాజకీయలపై మరియు టాలీవుడ్ పై పలు పోస్ట్ లు చేస్తు వార్తల్లో నిలుస్తుంటారు.

ఇక లేటెస్ట్ గా చూస్తే ఏపీ సియం జగన్ మోహన్ రెడ్డి ఇటీవలనే పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లపై కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. ఇక బండ్ల గణేష్ ఏపీ సియం వ్యాఖ్యలపై స్పందిస్తూ పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ గా ఒక వీడియో బైట్ రిలీజ్ చేసాడు. ఇక ఈ వీడియో బైట్ లో బండ్ల గణేష్ మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల విషయం పూర్తిగా వ్యక్తిగతమైనదని ప్రతిసారి ఆ విషయాన్నీ తీయడం సభ్యత కాదని అన్నాడు. అలాగే పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు ఆయన ప్రమేయం లేకుండా జరిగిపోయాయని ఆయన గుర్తు చేసాడు. అలాగే పవన్ కళ్యాణ్ ప్రజల మనిషి అని పదే పదే ఆయనను వ్యక్తిగత దూషణ చేసి అగౌరవ పరచకండి అని బండ్ల గణేష్ తన భావనను వ్యక్త పరిచాడు.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు