Bellamkonda Srinivas: యంగ్ డైరెక్టర్ ఒకే సినిమాలో ఇద్దరు యంగ్ హీరోలను ప్లాన్ చేస్తున్నాడు

Bellamkonda Srinivas: ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు సినిమా నేడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఒకవైపు రాజమౌళి సుకుమార్ వంటి దర్శకులు తెలుగు సినిమాని ఎల్లలు దాటిస్తుంటే, మరోవైపు కొత్త కొత్త దర్శకులు అందరూ వచ్చి తెలుగు సినిమాని కొత్త పుంతలు తొక్కిస్తున్నారని చెప్పొచ్చు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి చాలా మంది కొత్త దర్శకులు ఈ మధ్యకాలంలో పరిచయమయ్యారు. మరియు విజయ్ కనకమేడల కూడా ఒకరు.

హరీష్ శంకర్ వద్ద శిష్యరికం

హరీష్ శంకర్ వద్ద శిష్యరికం చేశాడు విజయ్. హరీష్ శంకర్ ఎటువంటి దర్శకుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కమర్షియల్ సినిమాకి కేరాఫ్ అడ్రస్ అని చెప్పొచ్చు. షాక్ సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా ఊహించిన స్థాయిలో ఆడలేదు. తర్వాత మళ్లీ రవితేజతో మిరపకాయ్ అనే సినిమా చేసి దర్శకుడుగా నిలబడ్డాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో చేసిన గబ్బర్ సింగ్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడితో హరీష్ శంకర్ స్టార్ డైరెక్టర్ అయిపోయాడు. ప్రస్తుతం హరీష్ శంకర్ అంటే అందరికీ గుర్తొచ్చేది గబ్బర్ సింగ్.

Vijay Kanakamedala

- Advertisement -

కాన్సెప్ట్ బేస్డ్ సినిమా

హరీష్ దగ్గర కొన్నేళ్లపాటు పనిచేసిన విజయ్ నాంది సినిమాతో దర్శకుడుగా మారాడు. హరీష్ శంకర్ దగ్గర పని చేసిన దర్శకుడు కాబట్టి ఒక కమర్షియల్ సినిమాని తీస్తాడు అనుకున్న తరుణంలో, ఒక కాన్సెప్ట్ బేస్డ్ సినిమా తీసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. అల్లరి నరేష్ లో ఉన్న మరో యాంగిల్ ని కూడా ఈ సినిమా బయటికి తీసింది అని చెప్పొచ్చు. అయితే మళ్లీ ఇదే కాంబినేషన్లో ఉగ్రం అనే ఒక సినిమా కూడా రిలీజ్ అయింది. ఈ సినిమా కూడా పరవాలేదు అనిపించింది. ఇప్పుడు విజయ్ మరో యంగ్ హీరో తో సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Bellamkonda Srinivas

బెల్లంకొండ శ్రీనివాస్ తో సినిమా

అల్లుడు శీను సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. వివి వినాయక దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘనవిజయాన్ని సాధించి బెల్లంకొండ శ్రీనివాసును హీరోగా నిలబెట్టింది. ఆ తర్వాత చేసిన కొన్ని సినిమాలు ఫలితాన్ని ఇవ్వలేదు గాని బెల్లంకొండ శ్రీనుకి అవకాశాలు మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం సాగర్ కే చంద్ర దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్నాడు శ్రీనివాస్. ఆ తర్వాత విజయ్ దర్శకత్వంలో సినిమా ఉండబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో నారా రోహిత్ కూడా ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి యంగ్ డైరెక్టర్ ఇద్దరు యంగ్ హీరోలను తన సినిమాలో ప్లాన్ చేశాడు. దీనిపై అధికారికి ప్రకటన రావాల్సి ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు