Mr Bachchan : హీరో, డైరెక్టర్ కన్నా.. ఇప్పుడు హీరోయిన్ కోసం వెళ్తున్నారట..

Mr Bachchan : టాలీవుడ్ లో ఆగష్టు 15న రిలీజ్ అయిన క్రేజీ సినిమాల్లో ‘మిస్టర్ బచ్చన్’ కూడా ఒకటి. మాస్ మహారాజ్ రవితేజ – హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలుండేవి. వీళ్ళ కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ సినిమా మిస్టర్ బచ్చన్ తెరకెక్కగా, రవితేజ – హరీష్ శంకర్ రిలేషన్ షిప్ పై ఇండస్ట్రీ లో, అభిమానుల్లో మంచి పేరుంది. పైగా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో, ఇంటర్వ్యూలలో కూడా ఇటు హరీష్(Harish shankar) , అటు రవితేజ ఒకరికొకరు బాగా పొగుడుకున్నారు. ఇక రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ కూడా మెప్పించడంతో భారీ అంచనాలు ఏర్పడగా, ఫైనల్ గా థియేటర్లకు ఎన్నో ఆశలతో వెళ్లిన అభిమానులకు మాత్రం దెబ్బేసారు.

BhagyaSree Borse is now a plus point for Mr Bachchan's movie

బోరింగ్ స్క్రీన్ ప్లే తో విసుగు తెప్పించారు..

ఇక మిస్టర్ బచ్చన్ (Mr Bachchan) సినిమాకు వెళ్లిన అభిమానులకు రొటీన్ స్క్రీన్ ప్లే తో ప్రేక్షకులకు దర్శకుడు విసుగు తెప్పించారు. కాగా రవితేజ (Raviteja) కూడా కొత్తదనం లేని యాక్టింగ్ తో ఒకింత నిరాశపరిచాడని చెప్పుకోలేని వాస్తవం. రీమేక్స్ తీయడంలో స్పెషలిస్ట్ అయిన హరీష్ శంకర్ మార్క్ ఈ సారి పని చేయలేదని ఎవ్వరూ ఊహించి ఉండరు. సినిమాపై ఉన్న భారీ అంచనాల కారణంగా ఫస్ట్ డే ఓపెనింగ్స్ బాగా రావొచ్చేమో గాని, సక్సెస్ విషయంలో మాత్రం వీకెండ్ అయిన తర్వాతే ఓ కొలిక్కి వచ్చే ఛాన్స్ ఉంది. ఇదిలా ఉండగా సినిమాలో ఏదైనా ప్లస్ పాయింట్ ఉందని చెప్పాలంటే హీరోయిన్ అని నెట్టింట కామెంట్స్ వస్తున్నాయి.

- Advertisement -

హీరో కాదు.. డైరెక్టర్ కాదు.. హీరోయిన్ కోసం..

ఇక ఈ సినిమా కోసం ఫస్ట్ డే వెళ్లిన ఆడియన్స్ లో హీరో కోసం వెళ్తున్న ఆడియన్స్ ఉన్నారు. డైరెక్టర్ కోసం వెళ్లిన ఆడియన్స్ ఉన్నారు. కానీ ఇప్పుడు మాత్రం హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే కోసమే వెళ్తున్నారని సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి. ఈ సినిమాలో నటించిన హీరోయిన్ తన అందచందాలతో యూత్ ని లాగేస్తుందని చెప్పాలి. సినిమాలో ఫస్ట్ సినిమా అయినా, టాక్ తో సంబంధం లేకుండా హీరోయిన్ గురించి ఎక్కువగా నెట్టింట మాట్లాడుతున్నారు. నిజానికి హీరోయిన్ కి పెర్ఫార్మన్స్ స్కోప్ ఉన్న రోల్ పెద్దగా దొరకకపోయినా, ఈ సినిమాలో తన గ్లామర్ షో తో ఓ రేంజ్ లో ఆకట్టుకుంటుంది. నెటిజన్లు ఈ సినిమాని కాపాడేది ఈ హీరోయినే అని అంటున్నారు. అంతలా భాగ్యశ్రీ మెస్మరైజ్ చేస్తుంది. ఇక ఈ సినిమా ప్లాప్ అయినా భాగ్యశ్రీ కి మరిన్ని ఆఫర్లు రావడం ఖాయమని సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు