Bharateeyudu2 : రిలీజ్ కి నెల ముందు రీ రిలీజ్? ఇంత గ్యాప్ కి ఏఎం రత్నమే కారణం?

Bharateeyudu2 : లోక నాయకుడు కమల్ హాసన్ శంకర్ షణ్ముగం కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఇండియన్2 షూటింగ్ పూర్తి కావచ్చింది. తెలుగులో ఈ చిత్రాన్ని భారతీయుడు2 పేరుతో రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా ఎప్పుడో పాతికేళ్ల కిందట వచ్చిన సినిమాకు ఇన్నేళ్ల తర్వాత సీక్వెల్ తెరకెక్కడం అరుదైన విషయం. ‘90వ దశకంలో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే సంచలనం రేపిన ‘భారతీయుడు’ కు ఇప్పుడు సీక్వెల్ రెడీ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా మొదలై నాలుగేళ్లు దాటిపోయింది. అనివార్య కారణాల వల్ల షూటింగ్‌కు బ్రేక్ పడి.. రెండేళ్ల విరామానంతరం తిరిగి పట్టాలెక్కింది ఈ సినిమా. ఇక దీని కారణంగానే రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ షూటింగ్ కి బ్రేక్ పడిన విషయం తెలిసిందే. అయితే భారతీయుడు2 చిత్రం ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది. ఇక ఈ సినిమా ముందు జూన్‌ లోనే రిలీజ్ అనుకున్నారు కానీ, తర్వాత ఇంకో నెల రోజులు ఆలస్యంగా రిలీజ్ చేయాలని నిర్ణయించారు. జులై 12న ‘భారతీయుడు’ బహు భాషల్లో ఒకేసారి విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో ‘భారతీయుడు’ చిత్రాన్ని రీ రిలీజ్ చేయబోతున్నారు చిత్ర యూనిట్.

Bharateeyudu Movie Re release 1 month before Bharateeyudu2 release

రెండింటికి సంబంధం లేదట..

ఇక భారతీయుడు సినిమాని జూన్ 7న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే ‘భారతీయుడు-2’ మేకర్స్‌కు, ‘భారతీయుడు’ రీ రిలీజ్‌కు ఏ సంబంధం లేదట. ‘భారతీయుడు-2’ చిత్రాన్ని నిర్మిస్తోంది లైకా ప్రొడక్షన్స్ సంస్థ. ‘భారతీయుడు’ తీసింది సీనియర్ నిర్మాత ఏఎం రత్నం. భారతీయుడు2 సీక్వెల్ రిలీజ్ కావడానికి దాదాపు నెల రోజుల ముందు ఈ చిత్రాన్ని అటు తమిళంలో, ఇటు తెలుగులో రిలీజ్ చేయబోతున్నారు ఏఎం రత్నం. ఇక జూన్ 7కు సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. ఇక సినిమాని కనీసం రెండు వారాలైనా నడిపించాలని చూస్తున్నారు. ‘భారతీయుడు-2’ ప్రాపర్ సీక్వెల్ కావడంతో మొదట ఈ సినిమాను ఒకసారి థియేటర్లలో చూసి, ఆ తర్వాత సీక్వెల్‌కు వెళ్లడం ప్రేక్షకులకు బాగానే ఉంటుంది. కాకపోతే కల్ట్ మూవీ అయిన ‘భారతీయుడు’ను చూశాక పెరిగే అంచనాలను సీక్వెల్ అందుకోవడం కష్టమే.

- Advertisement -

రీ రిలీజ్ కి ఇంత గ్యాప్ కి ఏఎం రత్నం కారణం?

అయితే ఇప్పుడు భారతీయుడు (Bharateeyudu2) రీ రిలీజ్ కి రెండో పార్ట్ కి నెల రోజుల గ్యాప్ కి ఏఎం రత్నమే కారణమని సమాచారం. చాలా ఏళ్లుగా ఏఎం రత్నం నిర్మించిన సినిమాలేవీ సరిగా ఆడడమేలేదు, అలాగే ‘హరి హర వీరమల్లు’ సినిమా షూటింగ్ ఆలస్యం కావడం వల్ల ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారు రత్నం. అయితే ఇటీవలే ఆయన ‘గిల్లి’ సినిమాను రీ రిలీజ్ చేస్తే మంచి ఆదాయం వచ్చింది. ఆ సినిమాతో దాదాపు పది కోట్లు వెనకేసుకున్నటు సమాచారం. అలాగే ఇప్పుడు ‘ఇండియన్’ రీ రిలీజ్‌తోనూ నాలుగు కాసులు వెనుకేసుకోవాలని ఆయన భావిస్తున్నారట. ఇండియన్2 కి వారం ముందు రిలీజ్ చేస్తే.. ఫస్ట్ డే తప్ప పెద్దగా పట్టించుకోరు. అదే పార్ట్2 కి నెల రోజులు ముందుగా రీ రిలీజ్ చేస్తే.. వారం రోజులైనా బాగా ఆడుతుందని ఇలా ప్లాన్ చేస్తున్నారట. మరి భారతీయుడు రీ రిలీజ్ థియేటర్లలో ఏ మేరకు ఆడుతుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు