Bhoomika: భర్తతో విడాకులు.. సడన్ గా ఆయన ఎంట్రీ ఇవ్వడంతో..?

Bhoomika.. ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ భూమిక తన అందచందాలతో యువతను ఆకట్టుకొని సొట్టబుగ్గల సందరిగా మరింత పేరు సొంతం చేసుకుంది. భూమిక సినిమా వస్తోందంటే చాలు అభిమానులలో ఎక్కడలేని ఆనందం.. హీరోయిన్ గా ఖుషి , ఒక్కడు, సింహాద్రి వంటి చిత్రాలు చేసి బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్న ఈమె టాలీవుడ్ లో భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. అంతేకాదు ఏకంగా మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ , ఎన్టీఆర్ వంటి హీరోలకు హిట్స్ ఇచ్చిన భూమికకి ఇండస్ట్రీలో మంచి పేరు కూడా లభించింది.

Bhoomika: Divorce with husband.. with his sudden entry..?
Bhoomika: Divorce with husband.. with his sudden entry..?

భర్త ఎఫైర్.. విడాకులు తీసుకోబోతున్న భూమిక..

ఇదిలా ఉండగా భూమిక ఇండస్ట్రీలో మంచి ఫామ్ లో కొనసాగుతున్నప్పుడు సెలబ్రిటీలకు యోగ నేర్పించే యోగ టీచర్ భరత్ ఠాకూర్ తో ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది. ఈ జంట కి ఒక బాబు కూడా జన్మించారు. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉన్న ఈ జంట మద్య అనూహ్యంగా వివాదాలు ఏర్పడ్డాయి అంటూ అప్పట్లో మీడియాలో వార్తలు తెగ హల్చల్ చేశాయి. దీనికి తోడు భర్తతో విసిగిపోయిన భూమిక విడాకులు తీసుకోబోతోంది అంటూ కూడా వార్తలు వచ్చాయి. పైగా వీరిద్దరి విడిపోతున్నారు అంటూ వార్తలు వచ్చినప్పుడు ఈ జంట పైన రకరకాల రూమర్లు పుకార్లు కూడా పుట్టుకొచ్చాయి.

నాగార్జున ఎంట్రీ తో సీన్ రివర్స్..

అందులో భాగంగానే భరత ఠాకూర్ ఇంకో అమ్మాయితో ఎఫైర్ పెట్టుకోవడం వల్ల సహించలేకపోయిన భూమిక తన భర్తకు విడాకులు ఇవ్వాలనుకుంది అంటూ రూమర్స్ తెరపైకి వచ్చాయి. అంతేకాదు విడాకులు తీసుకోవడానికి కోర్టులో కేసు కూడా వేద్దామనుకున్నారు అంటూ వార్తలు రాగా సడన్గా ఒక హీరో ఎంట్రీ తో సీన్ మొత్తం రివర్స్ అయినట్లు తెలుస్తోంది. ఆయన ఎవరో కాదు నాగార్జున. అక్కినేని నాగార్జునతో భూమిక స్నేహమంటే ఇదేరా అనే సినిమాలో నటించింది. ఆ సినిమా సమయంలో నాగార్జున , భూమిక మధ్య స్నేహం ఏర్పడిందట. అలా భరత్ ఠాకూర్ , భూమిక విడాకులు తీసుకోబోతున్నారు అంటూ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, వారి ఇంటికి వెళ్లి మరీ ఇద్దరినీ అడిగి తెలుసుకున్నారట నాగార్జున.

- Advertisement -

వార్తలకు చెక్ పెట్టిన భూమిక, భరత్

ఇక తర్వాత వారి మాటలు విని పూర్తిగా ఆశ్చర్యపోయారట.. మేమిద్దరం విడాకులు తీసుకోవడం లేదు.. మీడియాలో వచ్చే వార్తలలో నిజం లేదు. ఒకవేళ మేము స్పందిస్తే ఆ వార్తలు మరింత ఎక్కువ అవుతాయని ఉద్దేశంతో మేము ఖండించలేదు అంటూ భూమిక చెప్పిందట. మొత్తానికైతే ఈ విషయం బయట పడడంతో భూమిక , భరత్ ఠాగూర్ మధ్య వచ్చిన వార్తలు రూమర్ అంటూ కొట్టి పారేశారు. ఇక నాగార్జున ఎంట్రీ తోనే రూమర్లకు కాస్త చెక్ పడిందని చెప్పవచ్చు.

భూమిక కెరియర్..

ఇకపోతే భూమిక గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అద్భుతమైన నటనతో, అందంతో అలరిస్తున్న ఈమె సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా సినిమాలు చేస్తోంది. నాని హీరోగా నటించిన మిడిల్ క్లాస్ అబ్బాయి అనే సినిమాలో నానికి వదిన పాత్రలో కలెక్టర్ గా నటించి ఆకట్టుకుంది. ఒకప్పుడు హీరోయిన్ గా ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె సెకండ్ ఇన్నింగ్స్ లో కలెక్టర్ లాంటి హుందాగా ఉండే పాత్రలు చేసి అబ్బురపరిచింది. ప్రస్తుతం కథకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు ఎంచుకుంటూ బిజీగా మారే ప్రయత్నాలు చేస్తోంది భూమిక.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు