RC16: బుచ్చిబాబు ముందు బిగ్ ఛాలెంజ్..!

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ RRR సినిమా తర్వాత గ్లోబల్ స్టార్ గా ఎదిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రారంభమై చాలా కాలం అవుతున్నప్పటికీ శంకర్ సైమల్టేనియస్ గా ఇండియన్ 2 సినిమాపై కూడా దృష్టి పెట్టడంతో ఆలస్యం అవుతూ వస్తోంది. గేమ్ చేంజర్ సినిమా తర్వాత రామ్ చరణ్ బుచ్చిబాబు డైరెక్షన్లో ఒక సినిమా స్టార్ట్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. ఈ సినిమా కోసం బుచ్చిబాబు స్పోర్ట్స్ జానర్లో కథను ఇప్పటికే పూర్తి చేసి రామ్ చరణ్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ క్రమంలో ఒక్క సినిమా అనుభవం మాత్రమే ఉన్న బుచ్చిబాబు రాజమౌళి, శంకర్ లాంటి దర్శక దిగ్గజాల తర్వాత రామ్ చరణ్ ని ఎఫెక్టివ్ గా హ్యాండిల్ చేయగలడా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
రామ్ చరణ్ ని డ్యూయల్ రోల్ లో చూపించేందుకు ప్లాన్ చేస్తున్న బుచ్చిబాబు, ఈ గ్యాప్ ని సినిమాని భారీ ఎత్తున రూపొందించేందుకు కావాల్సిన ప్రిపరేషన్ చేసుకుంటున్నాడని సమాచారం అందుతోంది. మొదటి సినిమా ఉప్పెనతోనే 100కోట్ల మార్క్ టచ్ చేసిన బుచ్చిబాబుకి రామ్ చరణ్ లాంటి స్టార్ తో పాన్ ఇండియా సినిమాని డీల్ చేయాటం అసాధ్యమేమీ కాదని అంటున్నారు విశ్లేషకులు. స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ లో రూపొందనున్న ఈ సినిమా కోసం భారీ ఎత్తున యాక్షన్ సీక్వెన్స్ కూడా ప్లాన్ చేస్తున్నాడని వార్తలొస్తున్నాయి.
పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కి ప్లాన్ చేస్తున్న ఈ సినిమా కోసం ఇతర బాషల నుండి స్టార్ యాక్టర్లను తీసుకునే పనిలో ఉన్నాడట బుచ్చిబాబు. ప్రస్తుతం ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాను ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా స్టార్ట్ చేయాలని సినిమా యూనిట్ భావిస్తోందట. మరి, రెండో సినిమాతోనే ఇంత పెద్ద ఛాలెంజ్ ని ఫేస్ చేయనున్న బుచ్చిబాబు సక్సెస్ అందుకుంటాడా లేదా వేచి చూడాలి.
For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు