Raj Tarun Case : లావణ్య కేసు వెనక ఓ బడా ప్రొడ్యూసర్… బయటకొస్తున్న సంచలన నిజాలు

Raj Tarun Case : రాజ్ తరుణ్… చేసిన సినిమాలు హిట్ అయినా, ప్లాప్ అయినా… వరుసగా సినిమాలు చేస్తూ ఉండే హీరో. ఇప్పటి వరకు ఆయన మీద పెద్దగా కంట్రవర్సీలు కూడా ఏం లేవు. కొన్ని సినిమాల్లో ఆయన నుంచి వచ్చే కామెడీ టైమింగ్స్ కి చాలా మంది అభిమానులు కూడా ఉంటారు. అయితే సడన్‌గా ఈ హీరోపై ఓ కంట్రవర్సీ వచ్చి పడింది. లావణ్య అనే యువతి తనను పెళ్లి చేసుకుంటా అని మాయ మాటలు చెప్పి ఇప్పుడు తప్పించుకుని తిరుగుతున్నాడని, తనని మోసం చేశాడని, ఇప్పుడు నటి మాల్వీ మాల్హోత్రతో ప్రేమాయణం సాగిస్తున్నాడు అంటూ రాజ్ తరుణ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా, మాల్వీ మాల్హోత్ర ప్రస్తుతం రాజ్ తరుణ్‌తో తిరగబడరా సామి అనే సినిమాలో నటిస్తుంది.

రాజ్ తరుణ్ రియాక్షన్

లావణ్య కేసుతో ఒక్కసారిగా రాజ్ తరుణ్ వార్తల్లోకి వచ్చాడు. అయితే దీనిపై రాజ్ తరుణ్ వెంటనే స్పందించాడు. లావణ్యతో రిలేషన్ షిప్ నిజమే, కానీ, తాను డ్రగ్స్ కు అలవాటు పడిన నాటి నుంచి తన రెప్యూటేషన్ తగ్గిపోతుందని దూరంగా ఉంటున్నట్టు చెప్పుకొచ్చాడు. అలాగే హీరోయిన్ మాల్వీ మాల్హోత్రతో ఎఫైర్ అని లావణ్య చెప్పిన దాంట్లో నిజం లేదని కూడా వివరించాడు.

లావణ్య వెనక బడా ప్రొడ్యూసర్

ఈ వ్యవహరం అంతటికి కారణం ఏంటి ? అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. అయితే దీని అంతటికి ఓ కారణం ఉంది అంటూ ఇండస్ట్రీలో టాక్ వస్తుంది. అది ఏంటో కాదు… రాజ్ తరుణ్ పై కావాలనే ఈ కేసు పెట్టించారట. ఇండస్ట్రీలో ఓ బడా ప్రొడ్యూసర్… రాజ్ తరుణ్ పై లావణ్య చేత ఈ కేసు పెట్టించారని ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. రాజ్ తరుణ్ కు బ్యాడ్ నేమ్ రావాలని, ఆయన మాజీ లవర్‌తో కేసు పెట్టించాడని, దీని వల్ల రాబోయే సినిమాపై ఎఫెక్ట్ ఉంటుందని ఆ బడా ప్రొడ్యూసర్ అనుకుంటున్నట్టు సమాచారం.

- Advertisement -
Big producer behind Lavanya
Big producer behind Lavanya

ఆ ప్రొడ్యూసర్ ఇలా ఎందుకు చేస్తున్నాడంటే..?

బడా ప్రొడ్యూసర్ ఈ వ్యవహారం అంతా నడిపంచడానికి రాజ్ తరుణే కారణమని తెలుస్తుంది. రాజ్ తరుణ్ గతంలో ఈ బడా ప్రొడ్యూసర్‌తో మూవీ చేస్తా అని మాట ఇచ్చారట. అయితే తర్వాత రాజ్ తరుణ్ ఈ మాటను నిలబెట్టుకోకుండా… సినిమా అంటే దాట వేస్తూ వేరే నిర్మాతలకు కమిట్‌మెంట్ ఇస్తున్నారట. దీంతో విసుగు పుట్టిన సదరు నిర్మాత… రాజ్ తరుణ్‌కు బుద్ది చెప్పాలని ఇలా చేస్తున్నాడు అని ఇండస్ట్రీలో గుస గుసలు వినిపిస్తున్నాయి. కాగా, రాజ్ తరుణ్ – మాల్వీ మల్హోత్ర కలిసి నటిస్తున్న తిరగబడరా సామి మూవీ త్వరలో రిలీజ్ కానుంది.

లావణ్య – రాజ్ తరుణ్ రిలేషన్…

రాజ్ తరుణ్ – లావణ్యల మధ్య ప్రేమాయాణం చాలా రోజుల పాటు సాగింది. అయితే తర్వాత లావణ్య.. మాస్తాన్ అనే మరో యువకుడితో క్లోజ్ గా ఉండటం, డ్రగ్స్ బానిస అవ్వడం లాంటివి జరగడంతో లావణ్యను రాజ్ తరుణ్ దూరం పెట్టారట. వీళ్ల బ్రేక్ అప్ అయి కూడా చాలా రోజులు గడుస్తుందని, ఈ మధ్యలో మస్తాన్ – లావణ్యల వివాదం కూడా జరిగిందని సమాచారం. అయితే ఇప్పుడు ఆ.. నిర్మాత వల్ల రాజ్ తరుణ్‌పై లావణ్య ఈ కేసు పెట్టాల్సి వచ్చిందని టాక్.

లావణ్య ఫిర్యాదుపై పోలీసులు రియాక్షన్…

రాజ్ తరుణ్ తో పాటు మరి కొందరిపై లావణ్య ఫిర్యాదు చేసిందని, దాదాపు 4 పేజీల్లో ఈ ఫిర్యాదు ఉందని నార్సింగ్ పోలీసులు తెలిపారు. అయితే లావణ్య ఇచ్చిన ఫిర్యాదు సరైన ఫార్మాట్ లో లేదట. డేట్‌లు, టైం, ప్లేస్ లు వంటి సరిగ్గాలేవని, వీటితో పాటు చాలా వివరాలు లేవని పోలీసులు చెబుతున్నారు. వీటి గురించి లావణ్యను సంప్రదించడానికి ఫోన్స్ కాల్స్, నోటీసుల ద్వారా ట్రై చేస్తే ఆమె స్పందించడం లేదని పోలీసులు చెబుతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు