Bigg Boss 8: బుల్లితెర స్టార్ కపుల్ ఎంట్రీ.. రచ్చ మామూలుగా ఉండదుగా..?

Bigg Boss 8: బుల్లితెరపై అతిపెద్ద రియాల్టీ షో గా గుర్తింపు తెచ్చుకున్న బిగ్ బాస్ ఇప్పటివరకు ఏడు సీజన్లను దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. ఇప్పుడు 8వ సీజన్ కి రంగం సిద్ధం అవుతుండగా కంటెస్టెంట్స్ వీరే అంటూ ఒక్కొక్కరి పేర్లు తెరపైకి వస్తూ ఉండడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే తాజాగా ఒక టాప్ రేటెడ్ సీరియల్ లో హీరో హీరోయిన్లుగా నటిస్తున్న నటీనటులు ఈసారి సీజన్ 8లోకి అడుగుపెట్టబోతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.

సీజన్ 7.. స్టార్స్ ని వెనక్కి నెట్టి టైటిల్ విన్నర్ గా కామన్ మ్యాన్..

Bigg Boss 8: TV star couple's entry.. The ruckus is not usual..?
Bigg Boss 8: TV star couple’s entry.. The ruckus is not usual..?

ఇకపోతే గత ఏడాది బిగ్ బాస్ సీజన్ 7 ఉల్టా ఫుల్టా అంటూ డిసెంబర్లో గ్రాండ్గా ముగిసింది.అత్యధిక టిఆర్పీ రేటింగ్ సాధించిన సీజన్ 7 మేకర్స్ లో జోష్ నింపింది. నిజానికి ఆరో సీజన్ అట్టర్ ఫ్లాప్ అవడంతో.. ఎలాగైనా సరే సీజన్ 7 ను సరికొత్తగా ప్లాన్ చేయాల..ని అందుకు తగ్గట్టుగానే డిజైన్ చేశారు.. మొదట 14 మంది కంటెస్టెంట్స్ ని హౌస్ లోకి ప్రవేశపెట్టి 5 వారాల తర్వాత మరో 5 మంది కంటెస్టెంట్లను వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా లోపలికి పంపించారు. ఇక టాప్ సెలబ్రిటీలను కూడా వెనక్కి నెట్టి కామన్ క్యాటగిరీలో అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ టైటిల్ విన్నర్ అయ్యాడు. ఇకపోతే అర్జున్ అంబటి , ప్రియాంక సింగ్, శివాజీ, అమర్దీప్ , ప్రిన్స్ యావర్, పల్లవి ప్రశాంత్ ఫైనల్ కి చేరుకోగా పల్లవి ప్రశాంత్ టైటిల్ విన్నర్ అయ్యాడు.. అమర్దీప్ రన్నర్ గా నిలిచారు.. ఇక ఎప్పటినుంచో టైటిల్ ఫేవరెట్ గా ప్రచారం అయిన శివాజీ మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు.

సీజన్ 8 కంటెస్టెంట్స్..

ఇక ఈ నేపథ్యంలోనే ఈసారి ఎలాంటి కాన్సెప్ట్ తో వస్తారో అని అభిమానులు సైతం ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉండగా.. సీజన్ 8 ఆగస్టులో గ్రాండ్ గా లాంచ్ చేయనున్నారట. అప్పుడే కంటెస్టెంట్ ఎంపిక కూడా మొదలైందని.. ఇప్పటికే కొన్ని పేర్లు కూడా తెరపైకి వచ్చాయి.ఈ నేపథ్యంలోనే అనూహ్యంగా బ్రహ్మముడి సీరియల్ ద్వారా భారీ పాపులారిటీ దక్కించుకున్న మానస్, దీపికా రంగరాజు కూడా బిగ్ బాస్ 8 లో పాల్గొనబోతున్నట్లు సమాచారం.

- Advertisement -

బ్రహ్మముడి స్టార్ కపుల్..

2023 జనవరిలో బ్రహ్మముడి సీరియల్ ప్రారంభం అవ్వగా… స్టార్ మా టాప్ రేటింగ్ సీరియల్స్ లో బ్రహ్మముడి కూడా ఒకటి.. ఇందులో మానస్ , దీపికా రంగరాజన్ హీరో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సీరియల్ లో దీపికా రంగరాజు చేస్తున్న పాత్ర పేరు కావ్య.. మానస్ చేస్తున్న పాత్ర పేరు రాజ్.. ఈ ఇద్దరి కాంబినేషన్, వారి మధ్య కెమిస్ట్రీ సీరియల్ కే హైలెట్ గా నిలిచింది. అంతేకాదు వీరిద్దరూ అప్పుడప్పుడు నువ్వు నేను ప్రేమ వంటి సీరియల్స్ లో కూడా స్పెషల్ అప్పియరెన్స్ ఇస్తూ ఉంటారు.. అలా అన్ని సీరియల్స్ తిరిగేస్తూ భారీ పాపులారిటీ దక్కించుకున్న ఈ జంటను ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకురాబోతున్నట్లు సమాచారం. ఇక ఒకవేళ వీరు గనుక హౌస్ లోకి వచ్చారంటే కచ్చితంగా షో బ్లాక్ బస్టర్ అవుతుందంటూ అప్పుడే అంచనాలు మొదలయ్యాయి. మరి ఇందులో నిజా నిజాలు తెలియాలి అంటే కంటెస్టెంట్ లిస్ట్ వెలువడే వరకు ఎదురు చూడాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు