BIGBOSS – 8: లేడీ కంటెస్టెంట్ లతో హౌసులో రచ్చేనా..?

BIGBOSS – 8.. తెలుగు బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న బిగ్ బాస్ రియాల్టీ షో ఆగస్టు ఆఖరి వారం లేదా సెప్టెంబర్ మొదటివారం ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే 7 సీజన్లను దిగ్విజయంగా పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు ఎనిమిదవ సీజన్ కి సిద్ధం అవుతోంది. ఈ నేపథ్యంలోనే ఈసారి హౌస్ లోకి ఎవరెవరు రాబోతున్నారు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. ముఖ్యంగా ఈసారి హౌస్ లోకి సోషల్ మీడియా ద్వారా భారీ పాపులారిటీ సంపాదించుకున్న లేడీ కంటెస్టెంట్స్ అందరూ కూడా అడుగు పెట్టబోతున్నారు అనే వార్త ప్రకంపనలు సృష్టిస్తోంది అని చెప్పవచ్చు.

బిగ్ బాస్ -8 లోకి ప్రత్యేకంగా ఆ నలుగురు..

BIGG BOSS - 8: Will the lady contestants enter the house?
BIGG BOSS – 8: Will the lady contestants enter the house?

ముఖ్యంగా సోషల్ మీడియా ఇన్ ఫ్లూ యెన్సర్లు, యూట్యూబర్లు బిగ్ బాస్ హౌస్ లోకి రానున్నారని సమాచారం. అంతేకాదు గత ఏడాదికాలంగా వివిధ కారణాల వల్ల వార్తల్లో నిలిచిన సెలబ్రిటీలను కూడా హౌస్ లోకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయట.. ముఖ్యంగా నలుగురి లేడీ కంటెస్టెంట్ల పేర్లు ప్రధమంగా వినిపిస్తూ ఉండడం గమనార్హం. రేవ్ పార్టీలో అడ్డంగా దొరికిపోయిన ప్రముఖ నటి హేమ ఇటీవలే జైలుకు వెళ్లి బెయిల్ మీద బయటకు వచ్చిన విషయం తెలిసిందే… ఈమెతో పాటు అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసిన బర్రెలక్క.. రోడ్డు సైడ్ ఫుడ్ స్టాల్ పెట్టుకొని బాగా ఫేమస్ అయిన కుమారి ఆంటీ తో పాటు పరువు హత్య కేసులో భారీగా పేరు దక్కించుకున్న అమృత ప్రణయ్.. వీరంతా కూడా హౌస్ లోకి రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

బిగ్ బాస్ లోకి పరువు హత్య కేసు అమృత..

ముఖ్యంగా అమృత ప్రణయ్ విషయానికి వస్తే.. వేరే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకోవడంతో ఆమె తండ్రి స్వయంగా ఆమె భర్తను హత్య చేయించాడు. దీంతో తండ్రి పైనే కేసు పెట్టింది ఈమె.. ఇలా పర్సనల్ విషయాలతో వార్తల్లో నిలిచిన అమృత ప్రణయ్ ఈసారి బిగ్ బాస్ 8 లో కంటెస్టెంట్గా రావడానికి అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.

- Advertisement -

సీరియల్ యాక్టర్స్ కూడా..

వీరే కాకుండా సురేఖ వాణి, బ్రహ్మమూడి కావ్య, జబర్దస్త్ యాంకర్ రీతూ చౌదరి పేర్లు కూడా ఎక్కువగా వినిపిస్తూ ఉండడం గమనార్హం. ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ లేడీల పేర్లు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ముఖ్యంగా ఇందులో ఎంత నిజం ఉందో తెలియాలి అంటే బిగ్ బాస్ నిర్వహకులు విడుదల చేసే కంటెస్టెంట్ లిస్ట్ బయటకి వస్తే తప్ప ఎవరు హౌస్ లోకి రాబోతున్నారో స్పష్టం అవుతుంది.

లేడీ కంటెస్టెంట్లతో హౌస్ లో రచ్చ షురూ..

ఒకవేళ వీరే గనుక హౌస్ లోకి అడుగుపెడితే ఇక హౌస్ లో లేడీ కంటెస్టెంట్ ల రచ్చ మామూలుగా ఉండదని చెప్పడంలో సందేహం లేదు. ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో కూడా చాలామంది అమ్మాయిలు గ్లామర్ షో తోనే కాదు తమ ఆటలతో యువతను హీటెక్కించిన విషయం తెలిసిందే.. గొడవలు, కొట్లాటలు ,కోపాలు, శత్రుత్వాలు, ప్రేమలు ఇలా అన్నీ కూడా ఒకే హౌస్ లో చూపించేశారు. మరి ఇప్పుడు రాబోయే ఈ లేడీ కంటెస్టెంట్స్ ఎలా తమ ఉగ్రరూపాలని చూపిస్తారో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు