Bigg Boss : కొత్త బిజినెస్ ను స్టార్ట్ చేసిన బిగ్ బాస్ బ్యూటీ.. అంత డబ్బులు ఎలా సంపాదించిందబ్బా…?

Bigg Boss : టాప్ రియాలిటి షో బిగ్ బాస్ ద్వారా చాలా మంది సెలెబ్రేటీలుగా మారారు.. ఇప్పటికే ఎంతో మంది ముద్దుగుమ్మలు సినిమా ఇండస్ట్రీలో వరుస అవకాశాలను అందుకుంటున్నారు.. కొంతమంది మాత్రమే ఖాళీగా ఉంటూ యూట్యూబ్ వీడియోలను చేసుకుంటూ ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటున్నారు.. తాజాగా ఓ బ్యూటీ మాత్రమే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కొత్త సినిమాలు చేసింది.. ఇప్పుడేమో కొత్త బిజినెస్ లోకి ఎంట్రీ ఇచ్చింది.. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరు? అంత డబ్బులు ఎలా వచ్చాయో అన్నది ఒకసారి తెలుసుకుందాం..

తెలుగు బిగ్ బాస్ పై ఒకవైపు విమర్శలు వచ్చినా కూడా మరోవైపు మాత్రం అంతకు మించి అంటూ కొత్త టాస్క్ లను యాజమాన్యం యాడ్ చేస్తుంది.. ఈ షోకు ముందు హీరోగా ఉన్నవారు జీరోగా.. అసలు జనాలకు పరిచయమే లేని వాళ్లు హీరోలుగా మారుతుంటారు. కానీ చాలా మంది బిగ్‏బాస్ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగులో బిగ్‏బాస్ సీజన్ 7లో పాల్గొన్న ఈ నటి ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.. ఇప్పుడు రెండు సినిమాలు చేసింది కానీ పెద్దగా టాక్ ను అందుకోలేదు దాంతో బిజినెస్ లోకి అడుగు పెట్టింది..

Bigg Boss beauty Shubhashree has entered a new business
Bigg Boss beauty Shubhashree has entered a new business

ఆ బ్యూటీ మరెవరో కాదు.. శుభ శ్రీ రాయగురు.. ఈమె పుట్టినరోజు నిన్న ఈ సందర్బంగా కొత్త బిజినెస్ లోకి అడుగు పెట్టింది.. శుభశ్రీ హోమ్స్ పేరిట రియల్ ఎస్టేట్ కంపెనీ ప్రారంభించినట్లు తెలిపింది. అంతేకాకుండా కమర్షియల్ బిల్డింగ్స్, విల్లా, ఇల్లు, ప్లాట్స్ కొనాలనుకుంటే శుభశ్రీ హోమ్స్ సంప్రదించాలంటూ ఓ వీడియోను కూడా షేర్ చేసింది.. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. అంతగా ఫెమస్ అవ్వలేదు కానీ బిజినెస్ ను స్టార్ట్ చేసేంత డబ్బులు ఎలా వచ్చాయో అనే సందేహాలు మొదలయ్యాయి.. మరి దీనిపై పాప ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు