Bigg Boss Season 7: ప్రిన్స్ యావర్ కోపం వెనుక ఇంత బాధ ఉందా..?

Bigg Boss Season 7

బిగ్ బాస్ సీజన్ 7 రోజులు గడుస్తున్న కొద్దీ ఇంట్రస్టింగ్ గా మారుతోంది. ఈ సీజన్లో కంటెస్టెంట్స్ అందరూ యాక్టివ్ గా ఉండటంతో ఫస్ట్ వీక్ నుండే షో ఆసక్తిగా మారింది. ఇప్పటిదాకా హౌస్ నుండి షకీలా, కిరణ్ రాథోర్ ఎలిమినేట్ అవ్వగా థర్డ్ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది ఆసక్తిగా మారింది.
ఈ సీజన్ ఉల్టా పల్టా క్యాప్షన్ తో చాలా మార్పులు  చేసింది బిగ్ బాస్ టీమ్. ఈ సీజన్లో హౌస్ మేట్స్ కంటెస్టెంట్స్ గా మారాలంటే వారం వారం ఒక టాస్క్ పెట్టి, ఆ టాస్క్ లో గెలిచిన వారినే హౌస్ మేట్స్ గా ప్రమోట్ చేస్తున్నాడు బిగ్ బాస్. ఈ టాస్క్ లో ఫస్ట్ కంటెస్టెంట్ గా సందీప్ అర్హత సాధించగా తర్వాత శివాజీ అర్హత సాధించాడు.
పవర్ అస్త్ర టాస్క్ కంటెస్టెంట్స్ మధ్య గొడవలకు దారి తీస్తోంది. మిగతా హౌస్ మేట్స్ మాట పక్కన పెడితే, పవర్ అస్త్ర టాస్క్ లో ప్రిన్స్ యావర్ కి మాత్రం తీవ్ర అన్యాయం జరుగుతోంది. పవర్ అస్త్ర కోసం ఎవరెవరు పోటీ పడాలో కంటెస్టెంట్స్ ని డిసైడ్ అవ్వమని బిగ్ బాస్ చెప్పటం, ప్రతిసారి కంటెస్టెంట్స్ యావర్ ని పక్కన పెడుతూ వస్తుండటంతో యావర్ కి ఓ రేంజ్ లో కోపం వచ్చి అరవటం ఒకటి రెండు సార్లు జరిగింది.
యావర్ కోపం పట్ల సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వెలువడుతున్న నేపథ్యంలో ఫ్రైడే ఎపిసోడ్లో శివాజీ, యావర్ మధ్య కాన్వర్జేషన్ హార్ట్ టచింగ్ గా అనిపించింది. యావర్ తన కష్టాల గురించి చెప్తూ ఏడవటం ఆడియెన్స్ ని కూడా కలిచి వేసింది. యావర్ అరుపులు, కోపం వెనుక ఇంత బాధ దాగుందా అంటూ కామెంట్స్ వస్తున్నాయి. మొత్తానికి ఫ్రైడే ఎపిసోడ్ తో యావర్ కి సింపతీ క్రియేట్ అయ్యిందనే చెప్పాలి.
Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు