Bigg Boss Season7: రాహుల్ పై రతిక రివెంజ్ – మధ్యలో పల్లవి ప్రశాంత్ బలి..!

Bigg Boss Season7

మోస్ట్ పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 7 ఇటీవలే మొదలైన సంగతి తెలిసిందే. ఎప్పటిలాగే బిగ్ బాస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ప్రతి సీజన్లో కొన్ని వారాలు గడిచాక కంటెస్టెంట్స్ మధ్య లవ్ ట్రాక్ అవుతూండేది కానీ, ఈ సీజన్లో ఫస్ట్ వీక్ నుండే ఇద్దరు కంటెస్టెంట్స్ మధ్య లవ్ ట్రాక్ స్టార్ట్ చేసింది బిగ్ బాస్ టీమ్.

ఈ సారి హౌస్ లో రైతు బిడ్డ ట్యాగ్ తో వచ్చిన పల్లవి ప్రశాంత్, రతిక మధ్య లవ్ ట్రాక్ హైలైట్ గా నిలుస్తోంది. బిగ్ బాస్ కూడా ఈ జంట మధ్య మీడియేటర్ గా వ్యవహరిస్తున్నట్లు అనిపిస్తోంది. ఇదిలా ఉండగా రతిక ఎక్స్ బాయ్ ఫ్రెండ్ రాహుల్ సిప్లిగంజ్ మీద రివెంజ్ కోసమే ప్రశాంత్ తో లవ్ ట్రాక్ స్టార్ట్ చేసిందని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది.

రాహుల్ సిప్లిగంజ్ కూడా బిగ్ బాస్ సీజన్ 3లో కంటెస్టెంట్ గా వచ్చి టైటిల్ విన్ అయ్యాడు. ఆ సీజన్లో రాహుల్ పునర్నవితో లవ్ ట్రాక్ నడపటం వల్ల ఇద్దరికీ బ్రేకప్ అయ్యిందని, ఆ కారణంగానే రతిక ఇప్పుడు ప్రశాంత్ తో లవ్ ట్రాక్ స్టార్ట్ చేసిందని అంటున్నారు. అయితే, ఈ లవ్ ట్రాక్ వల్ల రతిక మీద పాజిటివ్ ఇంప్రెషన్ వస్తుంటే, సింపతితో హౌస్ లోకి ఎంటరైన ప్రశాంత్ మీద మాత్రం నెగిటివిటి వస్తోంది.

- Advertisement -

రైతు బిడ్డనని, రీల్స్ లో ఏడుపులు పెడబొబ్బలు పెట్టి సింపతీ సాధించి బిగ్ బాస్ హౌస్ కి ఎంట్రీ ఇచ్చిన ప్రశాంత్ ఇప్పుడు రతికతో పులిహోర కలపటం సహించలేకపోతున్నారు నెటిజన్స్. వీళ్ళ ట్రాక్ ఇలాగే కొనసాగితే గనక ప్రశాంత్ ఎలిమినేట్ అవ్వటం ఖాయం అని కామెంట్స్ వస్తున్నాయి. అయితే, ఈ వారం వరకూ నామినేషన్స్ లో ఉన్నవారిలో ప్రశాంత్ హయ్యెస్ట్ ఓట్స్ ఉన్నాయని తెలుస్తుండగా ఎవరు ఎలిమినేటి అవుతారనేది ఆసక్తిగా మారింది.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు