Bigg Boss Telugu Season 8 : ఒకప్పుడు తెలుగు, తమిళ సినిమాల్లో స్టార్ హీరోగా వెలుగొందిన ఓ నటుడు ఇప్పుడు బిగ్ బాస్ హౌజ్ లోకి అడుగు పెట్టబోతున్నాడని తెలుస్తోంది. అప్పట్లో హ్యాండ్సమ్ హీరోగా అమ్మాయిల మనసు దోచి రొమాంటిక్ హీరోగా ఓ వెలుగు వెలిగిన ఆ ప్రముఖ నటుడు తెలుగు బిగ్ బాస్ సీజన్ 8లో పాల్గొనబోతున్నాడు అని అంటున్నారు.
హౌజ్ లోకి తమిళ హీరో ఎంట్రీ
త్వరలో 8వ సీజన్ తెలుగు బిగ్ బాస్ ప్రారంభం కానుంది. తమిళ బిగ్ బాస్ షోకు మొదటి సీజన్ నుంచి కమల్ హాసన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. అయితే తెలుగు బిగ్ బాస్ షో విషయానికి వస్తే సీజన్ సీజన్ కు హోస్ట్ మారుతూ వస్తున్నారు. మొదటి సీజన్‌కు జూనియర్ ఎన్టిఆర్, రెండవ సీజన్‌కు నాని హోస్ట్‌గా వ్యవహరించారు. ఆ తర్వాత నాగార్జున మూడో సీజన్ నుంచి తెలుగు బిగ్ బాస్ షోను హోస్ట్ గా నాగార్జున విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఇప్పటిదాకా ఇంకా ఆయనే కొనసాగుతున్నాడు. ఇక ఈ సీజన్ కోసం నాగ్ అకౌంట్లో రెమ్యూనరేషన్ గా 30 కోట్లు పడబోతున్నాయని టాక్ నడుస్తోంది. ఇక ఇలాగే బిగ్ బాస్ తెలుగు సీజన్ 8కు సంబంధించి రోజుకో వార్త తెగ వైరల్ అవుతోంది. అందులో భాగంగానే ఓ తమిళ స్టార్ ఈసారి హౌజ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడని అంటున్నారు.
ఆ హీరో మరెవరో కాదు నటుడు అబ్బాస్. అప్పట్లో కోలీవుడ్‌లో రొమాంటిక్ హీరోగా తనదైన ముద్ర వేసిన అబ్బాస్ ఒక దశలో తన మార్కెట్‌ను కోల్పోయి సైడ్ రోల్స్‌లో నటించడం మొదలుపెట్టాడు. తర్వాత సినిమా అవకాశాలు రాకపోవడంతో సినిమా ఇండియాను వదిలేసి ఫ్యామిలీతో కలిసి న్యూజిలాండ్ లో సెటిల్ అయ్యాడు. ఇక అప్పుడప్పుడు అబ్బాస్ సోషల్ మీడియాలఓ పోస్ట్ చేసే వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. గతేడాది ఆయన తమిళ బిగ్‌బాస్ కార్యక్రమంలో పాల్గొనబోతున్నట్లు ప్రచారం జరగగా, అది పుకారుగానే మిగిలింది. అయితే ఈ ఏడాది తెలుగు బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వచ్చాయి. అంతేకాకుండా కంటెస్టెంట్ గా అడుగు పెట్టనున్న అబ్బాస్ కు భారీ రెమ్యూనరేషన్ కూడా ఇవ్వనున్నట్టు ప్రచారం జరుగుతోంది.
సీజన్ 8 కంటెస్టెంట్స్ లిస్ట్
ఉత్కంఠతతో పాటు వివాదాలకు నెలవు బిగ్ బాస్ రియాలిటీ షో. హిందీలో 15 సీజన్లకు పైగా నడుస్తున్న బిగ్ బాస్ గత కొన్నేళ్లుగా సౌత్ ఇండియన్ భాషల్లో నడుస్తోంది. ముఖ్యంగా తమిళం, తెలుగులో ఈ షో 2017 నుండి జరుగుతోంది. ఈ రెండు భాషల్లో ఇప్పటికి 7 సీజన్లు విజయవంతంగా పూర్తయ్యాయి. ఇప్పుడు 8 వ సీజన్ మొదలు కానుంది. అయితే ఈ సీజన్లో కంటెస్టెంట్స్ గా రీసెంట్ గా ఫుడ్ తో పాపులర్ అయిన కుమారి ఆంటీ, బర్రెలక్క, రీతు చౌదరి, క్రికెటర్ అంబటి రాయుడు, అమృత ప్రణయ్, విష్ణుప్రియ, హేమ, వేణు స్వామి, సురేఖవాణి, సోనియా సింగ్, బుల్లెట్ భాస్కర్, కిరాక్ ఆర్పి, బంచిక్ బబ్లూలాంటి సెలబ్రిటీల పేర్లు వినిపిస్తున్నాయి.