మెగా ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలో చాలామంది హీరోలు ఉన్నారు. అయితే హీరోయిన్ మాత్రం ఒక్కరే ఉన్నారు. మెగా ప్రిన్సెస్, మెగా బ్రదర్ నాగబాబు ముద్దుల కూతురు నిహారిక మాత్రమే టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చే ధైర్యం చేసింది. అయితే మెగా ఫ్యాన్స్ మాత్రం ఆమెను ఆదరించలేదు. ఈ బ్యూటీ నాగశౌర్యతో “ఒక మనసు” అనే సినిమాతో టాలీవుడ్ ఇచ్చిన విషయం తెలిసిందే. మంచి ఫీల్ గుడ్ మూవీ అయినప్పటికీ ‘ఒక మనసు’ మూవీ డిజాస్టర్ అయ్యింది. కానీ ఆమె నాగశౌర్యతో చేసిన రొమాంటిక్ సీన్లు మాత్రం మెగా ఫ్యాన్స్ కు నచ్చలేదు. ఆ తర్వాత ‘సూర్యకాంతం’ లాంటి పలు సినిమాల్లో నటించినప్పటికీ నిహారికకు కాలం కలిసి రాకపోవడంతో పాటు, మెగా ఫ్యాన్స్ సపోర్ట్ కూడా లభించలేదు. దీంతో పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలని డిసైడ్ అయిపోయింది. కానీ ఆమె పెళ్లి జీవితం కూడా ఎక్కువ కాలం నిలవలేదు.
జొన్నలగడ్డ చైతన్యను పెళ్లి చేసుకున్న నిహారిక, ఇటీవల డివోర్స్ తీసుకుని అతని నుంచి దూరమైంది. ఇక అప్పటి నుంచి ఆమె ఏం చేసినా, నిహారికకు సంబంధించిన ఏ విషయమైనా జనాలు ట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే నిహారిక ఒక బ్లాక్ బస్టర్ హిట్ మూవీని చేజార్చుకుందని వార్తలు వినిపిస్తున్నాయి. అక్కినేని నాగచైతన్య హీరోగా, తమన్నా హీరోయిన్ గా నటించిన రొమాంటిక్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైన్ మూవీ “100% లవ్”. సుకుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ బ్రేక్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ మూవీలో ముందుగా మెగా డాటర్ నిహారికను హీరోయిన్ గా తీసుకోవాలని మేకర్స్ అనుకున్నారట.
కానీ అప్పటికి నిహారికకు టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చే ఆలోచన లేదట. మెగా ఫ్యామిలీ కూడా దీనికి ఒప్పుకోలేదట. ఇంకేముంది ఆ అద్భుతమైన ఛాన్స్ మిల్కీ బ్యూటీ తమన్నాకు వెళ్ళిపోయింది. ఒకవేళ ఈ సినిమాతో గనక మెగా డాటర్ డెబ్యూ ఇచ్చి ఉంటే, ఇప్పుడు నిహారిక టాలీవుడ్ లో మంచి పొజిషన్లో ఉండేది అని అంటున్నారు మెగా ఫ్యాన్స్. కానీ ఆమెను విమర్శించే వాళ్ళు మాత్రం నిహారిక ఈ సినిమాలో నటించకపోవడమే మంచిదయిందని, ఒకవేళ ఆమె గనక ఈ సినిమాలో నటించి ఉంటే బ్లాక్ బస్టర్ మూవీ కాస్త ప్లాఫ్ అయ్యేది అంటూ సెటైర్లు వేస్తూ, ఎప్పటిలాగే ట్రోల్ చేస్తున్నారు. కాగా నిహారిక ఇటీవలే సినిమా నిర్మాణ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. మరి ఇలాగైనా ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటుందేమో చూడాలి.
Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.