Chandramukhi 2 : సౌత్ సినిమాలో బాలీవుడ్ ఫైర్ బ్రాండ్

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన చాల సినిమాలు మంచి హిట్స్ అయ్యాయి. అందులో చంద్రముఖి కి ప్రత్యేక స్థానం ఉంటుంది. 2005 లో వచ్చిన ఏ చిత్రం పెద్ద విజయాన్ని నమోదు చేసింది. పి. వాసు దర్శకత్వం లో వచ్చిన ఈ చిత్రం లో రజనీకాంత్ ప్రధాన పాత్ర చేయగా, జ్యోతిక, ప్రభు కూడా నటించారు. జ్యోతిక, రజనీకాంత్ నటనకు అప్పట్లో విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందాయి.

కేవలం 19 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ చిత్రం 75 కోట్ల వరకు వసూళ్లు చేసింది. ఆ కాలం లో ఇదే పెద్ద హిట్. తాజాగా ఈ చిత్రానికి కొనసాగింపుగా నాగవల్లి అనే సినిమా చేశారు. దీనికి పి. వాసు దర్శకత్వం వహించగా, విక్టరీ వెంకటేష్ హీరోగా నటించాడు. కానీ ఇది పెద్దగా హిట్ కాలేదు. దీంతో చంద్రముఖి సీక్వెల్ ఇది కాదంటూ అభిమానులు విమర్శలు గుప్పించారు. తాజాగా చంద్రముఖికి మరో సీక్వెల్ చేయాలని డైరెక్టర్ వాసు భావించాడు.

చంద్రముఖి 2 అని టైటిల్ ను ఫిక్స్ చేసి షూటింగ్ కూడా స్టార్ట్ చేశారు. దీనిలో రాఘవ లారెన్స్ ప్రధాన పాత్ర చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం గురించి ఒక ఆసక్తి కరమైన వార్త సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది. చంద్రముఖి 2 లో బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ కీ రోల్ చేస్తుందని సమాచారం. అయితే చంద్రముఖి 2 లో ఫైర్ బ్రాండ్ కంగనా అలంటి పాత్ర చేస్తుందో అనేది మాత్రం క్లారిటీ లేదు.

- Advertisement -

కాగా కంగనా ప్రస్తుతం తేజస్, టికు వెడ్స్ షేరు, ఎమర్జెన్సీ తో పాటు మరో మూడు సినిమాలు చేస్తుంది. ఇప్పుడు ఒక వేళ చంద్రముఖి 2 లో కంగనా నటిస్తే ఈమె చేతిలోకి మరో సినిమా వచ్చినట్టే. కాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు