Bramhanandam : మెల్లిగా పికప్ పెంచుతున్న బ్రహ్మీ.. ఇక బిజీ అయినట్టేనా?

Bramhanandam : టాలీవుడ్ లో హాస్య బ్రహ్మ గా మూడున్నర దశాబ్దాల పాటు తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్న బ్రహ్మానందం గురించి ప్రత్యేకంగా చెప్పాసిన పనిలేదు. ఏకంగా వెట్టికి పైగా సినిమాలు చేసి గిన్నీస్ రికార్డ్ కూడా సృష్టించారు. ఒకానొక దశలో టాలీవుడ్ లో బ్రహ్మానందం లేని సినిమా లేదంటే అతిశయోక్తి కాదు. అయితే మారుతున్న కాలంతో పాటు ఆరోగ్య కారణాల రీత్యా బ్రహ్మానందం సినిమాల సంఖ్య తగ్గించుకున్నారు. ఇక స్టార్ హీరోలతో మూవీస్ చేస్తోన్న దర్శక, నిర్మాతలు కూడా ఎక్కువగా యాక్షన్ బ్యాక్ డ్రాప్ కథలు చేస్తున్నారు. కమర్షియల్ జోనర్ లో ఎంటర్టైన్ మెంట్స్ పాళ్ళు ఎక్కువగా ఉండే కథలు ప్రస్తుతం తెలుగులో పెద్దగా రావడం లేదు. అందుకే బ్రహ్మానందం కూడా ఈ మధ్యకాలంలో సినిమాలలో పెద్దగా కనిపించడం లేదు. అప్పుడప్పుడు కొన్ని మూవీస్ లో సందడి చేస్తోన్నా, వాటిలో గెస్ట్ అప్పీరియన్స్ క్యారెక్టర్స్ మాత్రమే చేస్తున్నారు. బ్రహ్మానందం (Bramhanandam) పూర్తి నిడివిలో కనిపించిన సినిమాలు అంటే ఈ మధ్యకాలంలో బ్రో, రంగమార్తాండ, కీడాకోలా సినిమాలు మాత్రమే అని చెప్పొచ్చు. అయితే ఈ ఏడాది రాబోతున్న చాలా సినిమాలలో బ్రహ్మీ కనిపించబోతున్నారని తెలుస్తుంది.

Bramhanandam Upcoming movies updates

పికప్ అందుకున్న బ్రహ్మీ.. వరుస సినిమాలతో బిజీ?

లాక్ డౌన్ తరవాత తన హవా తగ్గించిన బ్రహ్మానందం, ఇప్పుడు మెల్లిగా పుంజుకున్నారు. ముందుగా కొడుకు గౌతమ్ తో కలిసి హాస్య బ్రహ్మి మళ్ళీ తెరపై కామెడీ పండించబోతున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో ఓ మూవీ సెట్స్ పైకి వెళ్ళింది. అలాగే కల్కి 2898ఏడీ సినిమాలో కూడా బ్రహ్మానందం ఓ ఇంటరెస్టింగ్ రోల్ లో కనిపించబోతున్నారట. అయితే ఈ పాత్ర ఏంటనేది చిత్ర యూనిట్ రివీల్ చేయలేదు. కల్కి యానిమేటెడ్ సీరీస్ లో కూడా ఆయన ఉన్నారు. అలాగే రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీలో కూడా గెస్ట్ అప్పీరియన్స్ ఇస్తున్నట్లు సమాచారం. మంచు విష్ణు పాన్ ఇండియా మూవీ కన్నప్పలో బ్రహ్మానందం నటిస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమాలో కమెడియన్ గానే బ్రహ్మి సందడి చేస్తారని తెలుస్తోంది. ఇక ఇవన్నీ పాన్ ఇండియా సినిమాలే కావడం విశేషం.

- Advertisement -

నెక్స్ట్ ఇయర్ మరింత బిజీ..

ఇక ఇవే కాకుండా మరికొన్ని పాన్ ఇండియా సినిమాలలో కూడా బ్రహ్మానందం నటిస్తున్నారని తెలుస్తోంది. అలాగే ప్రభాస్ రాజాసాబ్ మూవీలో ఓ పాత్రలో కనిపించబోతున్నారట. అయితే ఈ మూవీ వచ్చే ఏడాది రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. అయితే టాలీవుడ్ లో ఎంత మంది కమెడియన్స్ వచ్చిన బ్రహ్మానందాన్ని రీప్లేస్ చేయలేరని చెప్పాలి. ఆయన చేసే పెర్ఫార్మెన్స్ వేరే లెవల్ లో ఉంటుంది. సరైన పాత్ర పడితే బ్రహ్మానందం తన కామెడీతో కడుపుబ్బ నవ్విస్తారని కీడాకోలా మూవీతో గత ఏడాది ప్రూవ్ చేశారు. బ్రహ్మానందం ప్రస్తుతం ఇతర భాష సినిమాలలో కూడా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆల్రెడీ ఇండియన్ 2 లో నటించగా, త్వరలో అజిత్ సినిమాలో గెస్ట్ అప్పీరెన్స్ ఇవ్వనున్నట్టు ప్రచారం జరుగుతుంది.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు