BRO: ఈ మాత్రం చాలు ‘బ్రో’ పక్కా బ్లాక్ బస్టర్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కాంబినేషన్ సముద్రఖని డైరెక్షన్లో వినోదాయ సీతాం సినిమాకి రీమేక్ గా బ్రో సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. జులై 28న విడుదలకి సిద్దమవుతున్న ఈ సినిమాకి సంబందించిన ట్రైలర్ ఇటీవలే విడుదలై సినిమాపై అంచనాలను పెంచింది. మొదట్లో రీమేక్ సినిమా కావటంతో పెద్దగా బజ్ లేని ఈ సినిమా గ్లిమ్ప్స్ మొదలుకొని ట్రైలర్ వరకు రిలీజ్ అయిన అప్డేట్ ఒక్కొకటి సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. జులై 28న రిలీజ్ కి సిద్ధంగా ఉన్న ఈ సినిమా కోసం ,మెగా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
మరో పక్క టీజర్, ట్రైలర్ పట్ల ఫ్యాన్స్ లో కొంత నిరాశ కూడా ఉంది. ఆశించిన స్థాయిలో ట్రైలర్ లేకపోవటంతో ఒకింత నిరాశకు గురయ్యారు ఫ్యాన్స్. ఈ నేపథ్యంలో సెన్సార్ రిపోర్ట్ గురించి వినిపిస్తున్న సమాచారం ఆసక్తిని పెంచుతోంది. సినిమాకి క్లీన్ యూ సర్టిఫికెట్ రావటం, బోల్డ్ సీన్స్ వంటివి ఏమాత్రం లేకపోవటం సినిమాకు ప్లస్ అయ్యే అవకాశం ఉంది. ఈ మధ్య కాలంలో క్లీన్ యూ సర్టిఫికెట్ తో వచ్చిన స్టార్ హీరోల సినిమాలు లేకపోవటంతో ఫ్యామిలీ ఆడియెన్స్ ఈ సినిమాను ఆదరించే అవకాశం ఉంది.
పైగా సినిమా స్టార్ట్ అయ్యాక 20నిమిషాల తర్వాత పవన్ ఎంట్రీ ఉన్నప్పటికీ మొత్తం సినిమాలో పవన్ స్క్రీన్ ప్రెజెన్స్ 90నిమిషాల పాటు ఉండ్తుందని అంటున్నారు. పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీద కనిపించని సీన్స్ లో కూడా ఆయన ప్రెజెన్స్ ఉండేలాగా త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే ప్లాన్ చేసాడని అంటున్నారు. ఈ వార్త పవన్ అభిమానుల్లో ఆనందాన్ని నింపుతోంది.
విరూపాక్ష లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత తేజ్ నుండి వస్తున్న సినిమా కావడం, తొలిసారి మామ అల్లుళ్ళు కలిసి నటించిన సినిమా కావటంతో రీమేక్ అయినప్పటికీ ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. మరి ఏపీలో పవన్ కళ్యాణ్ కి రాజకీయంగా ఉన్న ప్రతికూలతను దాటుకొని బ్రో ఏ సినిమా ఏ మేరకు అలరిస్తుందో వేచి చూడాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు