RoshanKanakala: న్యూ ఇయర్ కి వస్తున్న ‘బబుల్ గమ్’.. ఎప్పుడొచ్చినా నో హైప్ అంటున్న ట్రేడ్ వర్గాలు?

టాలీవుడ్ లో టాప్ మోస్ట్ యాంకర్ గా పేరు తెచ్చుకున్న సుమ కనకాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె లేకుండా పెద్ద పెద్ద స్టార్ హీరోల ప్రీ రిలీజ్ ఈవెంట్లు కూడా ఉండవు. అలాంటి క్రేజ్ ఉన్న సుమ కనకాల తన భర్త రాజీవ్ కనకాల కంటే కూడా ఇండస్ట్రీ లో ఎక్కువ పాపులర్.

ఇక కొన్ని నెలల కిందట సుమ కనకాల కొడుకు రోషన్ కనకాల ‘బబుల్ గమ్’ అనే సినిమాతో హీరోగా పరిచయమవుతున్నాడన్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా మొదలు పెట్టినప్పటి నుండి ఇప్పటివరకు ఏమాత్రం హైప్ లేదని చెప్పాలి. బడా స్టార్స్ అయిన చిరంజీవి, వెంకటేష్ లాంటి హీరోలతో ఈ సినిమా సాంగ్స్ రిలీజ్ చేయించారు. అయినా సరే ఈ హీరో వైపు ఎవరూ చూడడం లేదు. పైగా సుమ కొడుకైనప్పటికీ రోషన్ లుక్స్ పరంగా ఆకట్టుకునేలా లేడు. పైగా ఫస్ట్ లుక్ లాంచ్ అయినప్పుడే చాలా ట్రోలింగ్ కి గురయ్యాడు.

ఇక లేటెస్ట్ గా మేకర్స్ న్యూ ఇయర్ స్పెషల్ గా డిసెంబర్ 29న ‘బబుల్ గమ్’ తో వస్తున్నామని అనౌన్స్ చేసారు. అయితే కామెంట్స్ కింద మాత్రం హీరోపైన ఓ రేంజ్ లో ట్రోలింగ్ చేస్తున్నారు నెటిజన్లు. అంతే కాక ఈ సినిమా ఎప్పుడొచ్చినా హైప్ ఉండదు అంటున్నారు. ఇటు నెటిజన్లు కూడా కంటెంట్ బాగుంటే జనాలు చూస్తారు తప్ప, స్టార్స్ తో ప్రమోట్ చేస్తే చూడరని కామెంట్స్ చేస్తున్నారు.

- Advertisement -

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు