Saripodhaa Sanivaaram : దానయ్య బడ్జెట్ దారి తప్పుతుందా..?

Saripodhaa Sanivaaram : హీరోల రెమ్యునరేషన్ అనేది నిర్మాతలకు ఎప్పుడూ భారంగానే ఉంటుంది. దీనికి తోడు సినిమాలో అనవసరమైన సన్నివేశాలను షూట్ చేయ్యడం. దీని వల్ల బడ్జెట్ అనుకున్న దాని కంటే.. ఎక్కువ అవ్వడం. ఇలాంటి విషయాలను చాలా మంది నిర్మాతలు బయట చెప్పుకుని తమ గోడును వెల్లబోసుకున్నారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి ఆర్ఆర్ఆర్ (RRR) లాంటి ఇండస్ట్రీ హిట్‌ సినిమాను నిర్మించిన డీవీవీ దానయ్యకు వచ్చిందని తెలుస్తుంది. ఆయన ప్రస్తుతం నాని హీరోగా, వివేక్ ఆత్రయ దర్శకత్వంలో వస్తున్న సరిపోదా శనివారం అనే సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీపై ఇండస్ట్రీలో వినిపిస్తున్న ఓ వార్త సంచలనంగా మారింది.

నాని – వివేక్ ఆత్రయ కలిసి చేసిన అంటే సుందరానికి సినిమా తర్వాత ఈ కాంబో మరో సినిమా చేస్తుందని, అనౌన్స్ మెంట్ వచ్చింది. గతేడాది అక్టోబర్ 24 పూజా కార్యక్రమాలతో మూవీ గ్రాండ్ గా స్టార్ట్ అయింది. ఇది నాని కెరీయర్ లో 31వ మూవీగా వస్తుంది. అయితే ఈ సినిమాను నిర్మించేది… డీవీవీ ఎంటర్టైన్‌మెంట్స్. సినిమా అనౌన్స్‌మెంట్ వచ్చిన తర్వాత వివిక్ ఆత్రేయ చెప్పిన స్టోరీకి దాదాపు 90 కోట్ల బడ్జెట్ ఎస్టిమేట్ చేశారట. అనుకున్నట్టే సినిమా షూటింగ్ స్టార్ట్ చేశారు.

భారీగా పెరిగిన బడ్జెట్…?

అయితే ప్రస్తుతం Filmifyకి అందిన సమాచారం ఏంటంటే… ఈ సినిమాకు ఇప్పటి వరకు 120+ కోట్ల వరకు బడ్జెట్ అయిందట. ఇంకా షూట్ చేయ్యాల్సిన పోర్షెన్ చాలా ఉందని టాక్. ఇప్పటికే అనుకున్న బడ్జెట్ కంటే, 30 కోట్ల కంటే ఎక్కువ ఖర్చు అయిందని, ఇంకా షూట్ పూర్తి అవ్వలేదని దానయ్య అంటున్నారట. అయితే సినిమా కోసం వివేక్ ఆత్రయ అనవసరమైన సీన్స్ ఎక్కువ షూట్ చేశారట. దీంతో బడ్జెట్ పెరిగిపోయిందని టాక్.

- Advertisement -

దిల్ రాజ్ నిజంగానే తీసుకున్నారట…?

కొద్ది రోజుల క్రితం, ఈ సరిపోదా శనివారం మూవీ బిజినెస్ జరిగిందని, దిల్ రాజు ఈ మూవీ రైట్స్ తీసుకున్నాడని న్యూస్ వచ్చింది. అయితే, ఈ బడ్జెట్ పెరిగిపోవడాలు… షూటింగ్ ఇంకా పూర్తి కాకపోవడం వంటి వల్ల.. ఈ డీల్ ఆగిపోయిందని ఇన్ సైడ్ టాక్. ఇప్పుడు మూవీ బడ్జెట్ 120 కోట్ల వరకు వెళ్లింది. మిగిలిన పార్ట్ చేయ్యడానికి మరో 10 నుంచి 15 కోట్ల వరకు బడ్జెట్ కావాల్సి వస్తుంది. దీంతో నాని సినిమాకు ఇంత బడ్జెట్ అంటే… డిస్ట్రిబ్యూటర్స్ ఆలోచిస్తున్నారనే టాక్ ప్రస్తుతం ఇండస్ట్రీలో వినిపిస్తుంది. కాగా, ఈ సినిమా ఆగష్టు 29న వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు