Allu Arjun : మరీ ఇంత దిగజారువు ఏంటి బన్నీ… జానీ మాస్టర్ నీకు బ్లాక్ బస్టర్ సాంగ్ ఇచ్చాడు.. అది కూడా గుర్తులేదా?

Allu Arjun : తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ప్రతిష్టాత్మకమైన అవార్డులు జాతీయ అవార్డులు.. తాజాగా కేంద్ర ప్రభుత్వం 70 వ జాతీయ చలనచిత్ర అవార్డులు పొందిన విజేతల జాబితాను రీసెంట్ గా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. 2022 ఏడాదికి గాను జాతీయ సినీ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.. ఈసారి వచ్చిన అవార్డులలో తెలుగు సినిమాలు పెద్దగా లేవని తెలుస్తుంది. తమిళ, కన్నడ, హిందీ చిత్రాలకే ఎక్కువగా అవార్డులు వచ్చినట్లు తెలిసిందే.. ఈ అవార్డులలో తెలుగు కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు కూడా అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే. ఆయనకు అవార్డు రావడంపై సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కానీ బన్నీ మౌనం వహించడం పై సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయి.

తెలుగు స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కి ఈ అవార్డు వచ్చింది తెలుగు సినిమాకు కాదు. తమిళ్‌ చిత్రానికి గాను జాతీయ అవార్డు ప్రకటించారు. పైగా ఆయన సతీష్ కృష్ణన్‌తో కలిసి ఉమ్మడిగా అవార్డు అందుకోనున్నారు. తమిళ్ చిత్రం తిరుచిత్రాంబళం అనే సినిమాకు ఈయనకు అవార్డు వచ్చింది. ఈ చిత్రం తెలుగులో తిరుగా డబ్బింగ్ అయ్యి రిలీజ్ అయ్యింది. ఈ సినిమాకుగాను కొరియోగ్రఫీ విభాగంలో జానీ మాస్టర్‌ను జాతీయ అవార్డ్ వరించింది.. ఈ వార్త విన్న అభిమానులు, సినీ ప్రముఖులు ఆయనకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.. కానీ అల్లు అర్జున్ మాత్రం జానీ మాస్టర్ కు విష్ చెయ్యలేదు. దీనిపై ఇప్పటికే ట్రోల్స్ మొదలయ్యాయి.

Bunny who didn't wish for Johnny Master .. Pawan Kalyan is the reason?
Bunny who didn’t wish for Johnny Master .. Pawan Kalyan is the reason?

జానీ మాస్టర్ బన్నీ సినిమాల్లో ఎన్నో పాటలను కంపోజ్ చేశారు. ఆ పాటలు ఎంతగా హిట్ అయ్యాయో మనం చూశాం.. గతంలో అలా వైకుంఠపురంలోని బుట్ట బొమ్మ సాంగ్ ఓ రేంజులో హిట్ అయ్యింది. ఇప్పటికి మాస్టర్ ఆ హుక్ స్టెప్ కనిపిస్తుంది. అలాంటది మాస్టర్ ను ప్రత్యేకంగా విష్ చెయ్యలేదు. కానీ అందరికీ శుభాకాంక్షలు అని చెప్పాడు. ఎందుకంటే జనసేన అభ్యర్థి, పవన్ కళ్యాణ్ వీరాభిమాని కావడం వల్లే విష్ చెయ్యలేదనే టాక్ వినిపిస్తుంది. దీనిపై బన్నీ, జానీ మాస్టర్ ఏమైన స్పందిస్తారేమో చూడాలి. ఇక బన్నీ సినిమాల విషయానికొస్తే.. పుష్ప 2 సినిమా చేస్తున్నాడు.. ఆ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

- Advertisement -

70 వ జాతీయ అవార్డుల విన్నర్స్…

ఇకపోతే ఈ సారి తెలుగులో పెద్దగా అవార్డులు రాలేదు. తమిళ, కన్నడ, హిందీ చిత్రాల హవానే కొనసాగింది. ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా కార్తీకేయ 2 నిలిచింది. ఇక తమిళంలో పొన్నియన్ సెల్వన్, కన్నడలో కేజీఎఫ్ సినిమాలను ఎక్కువ అవార్డులు వరించాయి. ప్రతిసారిలానే ఈ సారి కూడా ఉత్తరాది సినిమాలకే అధిక ప్రాధాన్యత ఇచ్చారు.. తెలుగులో అతి తక్కువ వచ్చినట్లు తెలుస్తుంది. ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా నిఖిల్ నటించిన కార్తికేయ 2 నిలవగా.. బెస్ట్ కొరియో గ్రాఫర్ కేటగిరీలో జానీ మాస్టర్‌ను జాతీయ అవార్డ్ వరించింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు