Kollywood : టాలీవుడ్ కన్నా ఘోరంగా కోలీవుడ్ థియేటర్ల పరిస్థితి… అక్కడ పూర్తిగా మూసేసారట?

Kollywood : టాలీవుడ్ లో ఈ ఏడాది సినిమాలు అంతగా ఆడలేదని చెప్పాలి. సంక్రాంతి తర్వాత పెద్దగా అంచనాలున్న సినిమాలు రాకపోగా, వచ్చిన మీడియం రేంజ్ చిన్న సినిమాలు కూడా ఆకట్టునేలా లేవు. అప్పుడెప్పుడో రెండు నెలల ముందు వచ్చిన “టిల్లు స్క్వేర్” తర్వాత ఇప్పటివరకు మరో సక్సెస్ లేదు. ఇక లాస్ట్ వీక్ రిలీజ్ అయిన సినిమాలు కూడా మరీ చెత్తగా ఉండగా, ఓవరాల్ గా స‌మ్మ‌ర్ మొత్తంలో లో థియేట‌ర్లు రిలీజ్ లు లేక వెల‌వెల బోయిన సంగ‌తి తెలిసిందే. చివ‌రికి క‌రెంట్ బిల్లు కూడా రాద‌ని భావించిన థియేట‌ర్ యాజ‌మాన్యాలు స్వ‌చ్ఛందంగా థియేట‌ర్లను పది రోజుల పాటు మూసివేసారు. తెలంగాణ‌తో పాటు ఏపీ సింగిల్ స్క్రీన్ థియేట‌ర్ల‌లలో ఈ స‌న్నివేశం కనిపించింది. కొన్ని చోట్ల మ‌ల్టీప్లెక్స్ లు కూడా మూత‌ప‌డ్డాయంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. ఉంటే ఇంగ్లీష్ సినిమాలు వేసుకోవ‌డం లేదంటే? మూసుకోవ‌డం అన్న‌ట్లే క‌నిపించింది ఏపీ – తెలంగాణ‌లో. అయితే ఇక్క‌డ ఈ ర‌క‌మైన స‌న్నివేశం రెండు మూడు వారాల నుంచి మొద‌లైంది. ఇక ఈ వారం కొంచెం మంచి అంచనాలతో మూడు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వీటితో టాలీవుడ్ కం బ్యాక్ ఇస్తుందేమో అని అనుకుంటున్నారు. కానీ టాలీవుడ్ క‌న్నా దారుణంగా ఉంది కోలీవుడ్ లో ప‌రిస్థితి.

Buyers in Kollywood closed theaters completely

తమిళనాడు లో మూత పడ్డ థియేటర్లు..

అవును.. అక్క‌డ అస‌లు క‌నీసం చిన్న సినిమాలు కూడా లేక‌పోవ‌డంతో సింగిల్ స్క్రీన్ థియేట‌ర్లు పూర్తిగా మూత వేసిన‌ట్లు ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. పొంగ‌ల్ కానుక‌గా కోలీవుడ్ లో కొన్ని సినిమాలు రిలీజ్ అయ్యాయి. అవి కూడా పెద్ద గొప్పగా ఏమి ఆడ‌లేదు. స్టార్ హీరోలు కాబ‌ట్టి బ‌ల‌వంత మీద ఆడించారు త‌ప్ప‌! న‌ష్టాలే వ‌చ్చాయి. సంక్రాంతి త‌ర్వాత స‌న్నివేశం పూర్తిగా మారిపోయింది. రీ-రిలీజ్ లు ఉండ‌టంతో కొన్ని థియేట‌ర్లకు అవ‌కాశం ద‌క్కింది. కానీ ఇప్పుడా ప‌రిస్థితి కూడా లేదు. ఎండ‌లు ముదిరాయి. రిలీజ్ లు లేవు. మొన్నామధ్య రిలీజ్ అయిన అరణ్మలై 4 సినిమా ఒక్కటి ఓ మోస్తరుగా ఆడుతుంది. దీంతో చూసి చూసి విసుగొచ్చిన త‌మిళ‌నాడు ఎగ్జిబిట‌ర్లు సింగిల్ స్క్రీన్ థియేట‌ర్ల‌ను పూర్తిగా మూసేసారు. ఈ మూత ఇంకా ఈ నెల రోజులు కూడా క‌నిపించే అవ‌కాశం ఉంది.

- Advertisement -

తెరచుకునేదెప్పుడు?

అయితే తెలుగు రాష్ట్రాలతో పాటు, కోలీవుడ్ (Kollywood) లో కూడా హిట్ మొహం చూసేదెప్పుడు? పూర్తి గా థియేటర్లు తెరుచుకునేదెన్నడో అని సినీ ప్రియులు ఎదురుస్తుస్తున్నారు. ఇక ఈ జూన్ లో కొన్ని రీ – రిలీజ్ లు ఉన్నాయి. వాటి కోసం కొన్ని థియేట‌ర్లు తీసే అవ‌కాశం ఉంది. మ‌ళ్లీ జూన్ 12వ‌ర‌కూ పెద్ద సినిమా రిలీజ్ లేదు. ఆ రోజున మాత్రం ఇండియ‌న్-2 రిలీజ్ అవుతుంది. ఆ వేవ్ కూడా వారం ప‌దిరోజులే ఉంటుంది. ఈ మ‌ధ్య‌లో గానీ.. ఆత‌ర్వాత గానీ ఎలాంటి రిలీజ్ లు లేవు. ర‌జనీకాంత్..క‌మ‌ల్ హాస‌న్ సినిమాలు సెట్స్ లో ఉన్నాయి. విజ‌య్ సినిమా `గ్రేట్` షూటింగ్ పూర్త‌యినా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ లో ఉంది. త‌ల అజిత్ సినిమాల ప‌రిస్థితి దాదాపు అలాగే ఉంది. `తంగ‌లాన్` లాంటి సినిమా రిలీజ్ కి రెడీగా ఉన్నా రిలీజ్ పై జాప్యం కొన‌సాగుతుంది. ఇవ‌న్నీ క్లియ‌ర్ అయితే త‌ప్ప మ‌ళ్లీ కోలీవుడ్ లో థియేట‌ర్లు క‌ళ‌క‌ళ‌లాడ‌టం క‌నిపించ‌దు. అంతవ‌ర‌కూ ప్రేక్ష‌కులు ఓటీటీల‌పై ఆధారపడాల్సిందే అంటున్నారు నెటిజన్లు.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు