Chandu Champion : బాలీవుడ్ ని ఈ ఛాంపియన్ ట్రాక్ లో పెడతాడా?

Chandu Champion : బాలీవుడ్ లో నిజ జీవిత క‌థ‌ల‌తో, లేదా ఆయా సంఘటనల ఆధారంగా సినిమాలు బాగా తెరకెక్కుతుంటాయని తెలిసిందే. రీసెంట్ గా 12th ఫెయిల్ అనే సినిమా ఆ విధంగానే తెరకెక్కి సూపర్ హిట్ కాగా, ఓటిటి లో రీసెంట్ గా అమర్ సింగ్ చమ్కీలా బయోపిక్ తెరకెక్కి నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ కాగా ఆ సినిమా కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇక ఇప్పుడు మరో క్రేజి బయోపిక్ సినిమా ప్రేక్షకులని అలరించడానికి రెడీ అవుతుంది. భారతదేశపు తొలి “పారాలింపిక్ క్రీడాకారుడు” “మురళీకాంత్ పేట్కర్” జీవితం ఆధారంగా ఈ చిత్రం “చందు ఛాంపియన్” (Chandu Champion). ఈ సినిమా ట్రైలర్ తాజాగా రిలీజ్ అయి మంచి రెస్పాన్స్ తో వ్యూస్ దక్కించుకోవడమే కాక, సినిమాపై కూడా భారీగా అంచనాలను పెంచేసింది. కబీర్ ఖాన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కార్తీక్ ఆర్యన్ ప్రధాన పాత్రలో నటించారు. ఇక ఈ స్పోర్ట్స్ డ్రామాలో రెజ్లర్ కం బాక్సర్‌గా కార్తీక్ నటించడం జరిగింది. అలాగే ఆర్మీ సైనికుడిగాను క‌నిపించాడు. గత కొన్ని రోజులుగా మేకర్స్ కథానాయ‌కుడి పోస్టర్‌లను విడుదల చేయ‌గా అద్భుత స్పంద‌న వ‌చ్చింది. ఇక కార్తీక్ తన పాత్ర లోకి ప‌ర‌కాయం చేయ‌డానికి శారీర‌కంగా జిమ్ లో ఎంత‌గా శ్ర‌మించాడో ఆ పోస్ట‌ర్ల‌ను చూస్తే అర్థ‌మైంది.

బయోపిక్ ట్రైలర్ తో అంచనాలను పెంచేశారు..

ఇక చందు ఛాంపియన్ ట్రైలర్ విషయానికి వస్తే.. 1967లో చందు (కార్తీక్ ఆర్య‌న్) ఒక భారతీయ సైనికుడిగా మిషన్‌లో తీవ్రంగా గాయపడిన తర్వాత కోమా నుండి మేల్కొన‌డాన్ని చూపిస్తూ ట్రైల‌ర్ స్టార్ట్ అవుతుంది. ఇక చందు తిరిగి పోరాడటాన్ని విశ్వసిస్తున్నాడని.. పోరాటాన్ని ఎప్పటికీ వదలడ‌నేది నేప‌థ్యంలో డైలాగ్ – చిన్నప్పటి నుండి అతడు ఎలా ఉండేవాడు? ఎలా చాంపియ‌న్ గా ఎదిగాడు? అన్న‌ది ట్రైల‌ర్ లో చూపించారు. ఇక సినిమాలో `చందు ఛాంపియన్` అంటూ వెకిలిగా ఆటపట్టిస్తారు. కానీ చందు ఒక రియ‌ల్ ఛాలెంజ‌ర్ గా, బెదిరించే వారికోసం తన ఆత్మను చంపకూడదని చందు నిర్ణయించుకుంటాడు. తన కలను నెరవేర్చుకోవడానికి స‌వాళ్ల‌కు ఎదురెళ‌తాడు. మ్యాచ్ ల‌లో పోరాడుతాడు. బాక్స‌ర్ గా త‌న పాత్ర కోసం కార్తీక్ ఆర్య‌న్ మేకోవ‌ర్ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది. అత‌డి పాత్ర ఆద్యంతం ఎమోష‌న‌ల్ గా సాగుతుంది.

Chandu Champion Movie Trailer Talk

- Advertisement -

బాలీవుడ్ ని ఛాంపియన్ గాడిలో పెడతాడా?

ఇక ఇంత‌కాలం రొమాంటిక్ కామెడీలతో అల‌రించిన కార్తీక్ ఆర్యన్‌ ఈ సినిమా(Chandu Champion)తో సరికకొత్తగా కనిపించనున్నాడు. కార్తీక్ పాత్ర ఆద్యంతం ఎన‌ర్జిటిక్ గా యాక్ష‌న్ మోడ్ లో క‌నిపించింది. ఇక ఇందులో ఎమోష‌న‌ల్ మూవ్ మెంట్స్ కి కొద‌వ లేద‌ని ట్రైల‌ర్ చెబుతోంది. ఇక చందు ఛాంపియన్ 14 జూన్ 2024న థియేటర్లలోకి రానుంది. అయితే బాలీవుడ్ ని ఈ ఇయర్ వరుస ప్లాపులు వెంటాడుతున్నాయి. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలు ఏమాత్రం ఆకట్టుకోలేదు. ఈ ఇయర్ లో సైతాన్, క్రూ వంటి సినిమాలు తప్ప భారీ విజయాలు సాధించిన సినిమాలు రాలేదు. ఇక బాలీవుడ్ లో బయోపిక్ సినిమాలకు పెద్ద పీట వేస్తారని తెలిసిందే. దంగల్, సంజు లాంటి బయోపిక్ చిత్రాలు రికార్డులు కొల్లగొట్టాయి. ఇప్పుడు చందు ఛాంపియన్ సినిమా కూడా బాలీవుడ్ ని ట్రాక్ లో పెడుతుందని నెటిజన్లు అంటున్నారు.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు