Jayalalitha: తప్పని పరిస్థితుల్లో ఎంతోమందికి లొంగిపోయా – జయలలిత..

సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కొత్తలో గ్లామర్ పాత్రలు, ఐటమ్ సాంగ్స్ చేస్తూ ప్రేక్షకులను అలరించిన జయలలిత అప్పుడు ఫుల్ క్రేజ్ తెచ్చుకొని చేతినిండా సినిమాలతో బిజీగా మారింది.. అయితే ఆ గ్లామర్ పాత్రల వల్లే తనకు ఇప్పటికీ కూడా మంచి పాత్రలు రావడంలేదని వాపోయింది ఈమె.. అప్పటి సీనియర్ హీరోయిన్ లు అందరూ అమ్మ , వదిన పాత్రలు చేస్తుంటే తనకు మాత్రం అలా చెప్పుకోదగ్గ పాత్రలేవి రావట్లేదని వ్యక్తిగత జీవితంలో కూడా ఎన్నో ఎదురు దెబ్బలు తగిలాయి అంటూ ఇటీవల వెల్లడించింది.. ఇక ఒక డైరెక్టర్ ను ప్రేమించి వివాహం చేసుకున్న తర్వాత అతడి టార్చర్ భరించలేక పెళ్లైన మూడు నెలలకే విడిపోయి అప్పటినుంచి ఒంటరిగానే ఉండిపోయింది జయలలిత.. ఈ క్రమంలోనే ప్రేమ, పెళ్లి జోలికి వెళ్లకూడదు అని నిర్ణయించుకున్న ఈమె తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎన్నో తెలియని విషయాలను వెల్లడించింది..

జయలలిత ప్రేమాయణం..
జయలలిత ఉమెన్స్ డే సందర్భంగా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. చాలామంది నన్ను రెండో పెళ్లి చేసుకుంటామన్నారు..కానీ నేనే ఆసక్తి చూపించలేదు.. ఒక్క పెళ్లితోనే నరకం చూసాను.. ఇక అందుకే మళ్ళీ పెళ్లి అనే ఆలోచన రాలేదు. అమ్మ నాన్న చనిపోయాక హైదరాబాద్ కి షిఫ్ట్ అయ్యాను.. ఆఫర్ల సంగతేమో కానీ ఇక్కడ సినీ ఆత్మీయులు ఉంటారని సెటిల్ అయ్యాను..

బిడ్డని కనాలనుకున్నాము..
నేను శరత్ బాబుని ప్రేమించాను.. అయితే ఈ విషయం ఎక్కడా చెప్పలేదు..ఆయనతోనే కలిసి ఉండాలని అనుకున్నాను కానీ ఆయన ఎక్కువ శ్రద్ధ పెట్టలేదు.. ఇప్పుడు ఆయన లేరు కాబట్టే అన్ని వివరాలు చెబుతాను ..ఆయనతో కలిసి అన్ని యాత్రలు చేశాను.. దేవుడు నాకంటూ ఒక గైడ్ పంపించాను అనుకున్నాను.. ఆయన ఎంతో మంచి వ్యక్తి.. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నా.. అయితే ఆ పెళ్లిని ఇండస్ట్రీకి చెందిన వాళ్లే ఆపారు.. మేమిద్దరం కలిసి ఒక బిడ్డను కూడా కనాలని ప్లానింగ్ చేసుకున్నాం.. కానీ ఆయన దేని గురించి అయినా సరే సంవత్సరాల తరబడి ఆలోచిస్తారు.. అందుకే మేమిద్దరం బిడ్డను కని.. చనిపోయాక ఆస్తి గురించి ఆ బిడ్డను ఎవరైనా హింసిస్తారేమో అని భయపడ్డాము.. ఇక మా మధ్య ఏం జరిగిందనేది ఎవరికీ తెలియదు..శరత్ బాబు భార్య రమాదేవి నాకు చాలా క్లోజ్.. ఆమెను అక్క అని ఆయనను బావా అని పిలిచేదాన్ని.. బావ అంటూనే చాలా క్లోజ్ అయిపోయా.. ఆయన దగ్గర కూర్చుంటే సమయం తెలిసేది కాదు..ఇక ఆయనకు సేవ చేసుకుంటూ ఉండిపోవాలనుకున్నాను.. కానీ దేవుడు తీసుకెళ్లిపోయాడు అంటూ చెప్పుకొచ్చింది జయలలిత..

- Advertisement -

తప్పని పరిస్థితిలో లొంగిపోయా..
ఇండస్ట్రీలో గ్లామర్ పాత్రలు ఎక్కువ వేయడంతో కొంతమంది ఆర్టిస్టులు వెంటపడేవారు.. అయితే ప్రతిసారి తప్పించుకోలేకపోయేదాన్ని.. కొన్నిసార్లు తప్పించుకున్నాను..మరికొన్నిసార్లు తప్పని పరిస్థితిలో లొంగిపోయాను.. నేను చెడిపోయినా పర్వాలేదు.. నా ఇంట్లో వాళ్ళు బాగుండాలి అనుకున్నాను.. అందుకే అలా చేశాను.. పైశాచికత్వంగా ఎవరు ప్రవర్తించలేదు వాళ్ళ అవసరం తీర్చుకొని వెళ్ళిపోయారు అంటూ తెలిపింది జయలలిత.. ఇక ఈ విషయాలు తెలిసి అభిమానులు సైతం ఆశ్చర్యపోతున్నారు.

check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు