Mega157 : జెట్ స్పీడ్ లో చిరు నెక్స్ట్ మూవీ స్క్రిప్ట్ పనులు… చిరు పాత్ర కూడా లీక్!

Mega157 : టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస ప్రాజెక్టులను లైన్లో పెడుతున్నాడు. లాస్ట్ ఇయర్ వాల్తేరు వీరయ్యతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన చిరంజీవి అదే ఏడాది భోళా శంకర్ తో డిజాస్టర్ కూడా అందుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత పక్కా గా హిట్ కొట్టాలని హోల్డ్ లో ఉన్న రీమేక్ సినిమాలను క్యాన్సిల్ చేసేసి విశ్వంభర అంటూ స్ట్రెయిట్ సినిమాతో వస్తున్నాడు. ఈ సినిమా ఒక సోషియో ఫాంటసీ సినిమాగా తెరకెక్కుతుండగా, బింబిసార ఫేమ్ వశిష్ఠ మల్లిడి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే సినిమాకి సంబంధించి 80 శాతానికి పైగా షూటింగ్ పూర్తయిపోగా, క్లైమాక్స్ ఎపిసోడ్, మరో రెండు పాటలు మాత్రమే బాకీ ఉన్నట్టు సమాచారం. అయితే ఈ సినిమా పూర్తి కాకుండానే మెగాస్టార్ మరో సినిమాకి సంబంధించి పనులు అప్పుడే మొదలయ్యాయి.

Chiranjeevi Mega157 movie update

మొదలైన మెగా157 స్క్రిప్ట్ వర్క్…

ఇక మెగాస్టార్ చిరంజీవి 157వ (Mega157) సినిమాను మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నట్టు ఇది వరకే వార్తలు వచ్చాయి. కథా రచయిత దర్శకుడు బివిఎస్ రవి చెప్పిన స్టోరీ లైన్ చిరంజీవి ఒకే చేసినట్టు తెలుస్తుంది. అంతే కాదు ఈ స్క్రిప్ట్ డెవలెప్మెంట్ పై ఆల్రెడీ దృష్టి పెట్టినట్టు, మోహన్ రాజా చెన్నై లో జెట్ స్పీడ్ గా స్క్రిప్ట్ తయారీ చేస్తున్నట్టు సమాచారం. ఇక మెగా157 కు ఓవరాల్ గా కథ బివిఎస్ రవి సమకూరుస్తుండగా, దర్శకుడుగా మోహన్ రాజా ఉండగా, ఈ సినిమాని చిరంజీవి కూతురు సుస్మిత నిర్మించనున్నట్టు తెలుస్తుంది. అలాగే ఈ సినిమాకి సంబంధించి చిరంజీవి పాత్రకి సంబంధించి కూడా సమాచారం లీక్ అయింది.

- Advertisement -

మెగా157లో చిరు పాత్ర ఇదే!

ఇక మెగాస్టార్ చిరంజీవి మోహన్ రాజా తో చేయబోయే తన 157వ సినిమాలో తన పాత్రకి సంబంధించి అప్డేట్ లీక్ అయింది. ఈ సినిమాలో చిరంజీవి ఒక పెళ్లయిన నడి మధ్య వయస్కుడి గా కనిపిస్తారు అన్న టాక్ నడుస్తుంది. అంతే కాదు చిరుకు ఈ సినిమాలో ఒక కూతురు, కొడుకు కూడా ఉండే ఛాన్స్ ఉందట. ఇక ఈ సినిమాను ఈ ఏడాది చివర్లో విశ్వంభర షూటింగ్ పూర్తి కాగానే షూట్ స్టార్ట్ చేస్తారని సమాచారం. మరి ఈ వార్తల గురించి చిత్ర యూనిట్ నుండి ఎప్పుడు అఫిషియల్ గా అప్డేట్ వస్తుందో చూడాలి. ఇక చిరంజీవి విశ్వంభర టీజర్ ఆయన బర్త్ డే స్పెషల్ గా రిలీజ్ కానుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు