Nag Aswin- Chiranjeevi : నాగీతో చిరంజీవి సినిమా… జంక్షన్ జామ్ అయిపోవాల్సిందే..

Nag Aswin- Chiranjeevi : ప్రపంచవ్యాప్తంగా కల్కి మేనియా కొనసాగుతుంది.. నిన్న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా భారీ కలెక్షన్స్ తో పాటుగా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది.. ఈ సినిమా ఇప్పటికే బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యిందనే వార్తలు వినిపిస్తున్నాయి.. దర్శకుడు నాగ్ అశ్విన్ పురాణాల పై ఉన్న ఆసక్తితో ఈ సినిమాను తెరకేక్కించారని చాలా సార్లు వివరించారు.. అందుకే ఈ సినిమా అందరిని బాగా ఆకట్టుకుంది.. సినిమాను చూసిన స్టార్ హీరోలు, డైరెక్టర్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి కూడా సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.. ఆ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది..

కమల్ హాసన్, అమితాబ్, దీపికా పదుకొనే వంటి స్టార్స్ నటించిన కల్కి సినిమా థియేటర్లలోకి వచ్చిన మొదటి రోజే కలెక్షన్స్ సునామీ సృష్టించింది.. సోషల్ మీడియాలో సినీ, రాజకీయ ప్రముఖులు రివ్యూలు ఇస్తున్నారు.. ఇండస్ట్రీలోని స్టార్స్ అందరు కూడా కల్కి సినిమా పై, నాగ్ అశ్విన్ పై ప్రశంసలు కురిపించారు.. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి కూడా ట్విట్టర్ ద్వారా ప్రశంసలు కురిపించారు.. సినిమా చూడకపోయిన సినిమా గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.. కల్కి 2898 ఏడీ గురించి అద్భుతమైన రిపోర్టులు వినిపిస్తున్నాయి.

అమితాబ్ బచ్చన్, ప్రభాస్, దీపికా, కమల్ హాసన్ లాంటి పెద్ద పెద్ద స్టార్లతో ఇలాంటి మైథలాజికల్ సై ఫి ఫ్యూచరిస్టిక్ సినిమా తీసిన నాగ్ అశ్విన్ క్రియేటివ్ జీనియస్ కు అభినందనలు. నా ఫేవరెట్ ప్రొడ్యూసర్ అశ్వినిదత్ గారికి, ఎంతో అభిరుచి కలిగిన, ధైర్యవంతులైన స్వప్న దత్, ప్రియాంకా దత్ లు ఈ ఘనత సాధించిన మొత్తం టీమ్ కు నా శుభాకాంక్షలు. ఇలా కలలు కంటూనే ఉండండి. ఇండియన్ సినిమా పతాకాన్ని మరింత పైకి ఎగరేస్తూనే ఉండండని చిరంజీవి ట్వీట్ చేశాడు..

- Advertisement -
chiranjeevi shocking comments on kalki movie
chiranjeevi shocking comments on kalki movie

వైజయంతి మూవీస్ బ్యానర్ పై చిరంజీవి ఎన్నో సినిమాలను చేశాడు. ఆ సినిమాలు అన్ని మంచి హిట్ టాక్ అందుకున్నాయని తెలిసిందే.. ఈ ట్వీట్ వైరల్ అవ్వడంతో చిరంజీవి మెగాస్టార్ ఫ్యాన్స్ తో పాటుగా నెటిజన్లు కూడా స్పందిస్తున్నారు.. చిరంజీవి నెక్స్ట్ నాగీ మూవీలో నటిస్తున్నాడా? ఆ సినిమా గురించి ఏమైనా హింట్ ఇస్తున్నాడా? అసలు ఇలాంటి సినిమాలను ఎక్కువగా చిరంజీవికే సూట్ అవుతాయి.. మరి వీరిద్దరి కాంబోలో కొత్త సినిమా రాబోతుందేమో చూడాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.. ఈ వార్తల్లో నిజమేంత ఉందో తెలియదు కానీ ఈ వార్త మాత్రం సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తుంది.. ఈ వార్తల పై నాగీ, చిరంజీవి స్పందిస్తారేమో చూడాలి..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు