BholaaShankar: కమల్ ని చూసి చిరు చాలా నేర్చుకోవాలి..!

మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చాక యువ హీరోలతో పోటీ పడుతూ వరుసగా సినిమాలైతే చేస్తున్నాడు గానీ, ఆయన స్థాయికి తగ్గ కథలు ఎంచుకోవడంలో విఫలమవుతున్నాడనే చెప్పాలి. ఖైదీ నంబర్ 150 నుండి ఒక ‘సైరా’ మినహా ప్రతి సినిమా విషయంలో సేఫ్ గేమ్ ని నమ్ముకున్నాడు మెగాస్టార్. తన చిరకాల కోరికైనా సైరా సినిమా కమర్షియల్ గా సక్సెస్ అయ్యుండచ్చు గానీ, పర్ఫామెన్స్ పరంగా చిరంజీవి స్థాయి సినిమా కాదు. ప్రస్తుతం మెహర్ రమేష్ డైరెక్షన్లో చిరంజీవి నటిస్తున్న భోళాశంకర్  సినిమా కి కూడా ఏ మాత్రం హైప్ లేదు. ఇక తాజాగా సినిమా యూనిట్ రిలీజ్ చేసిన టీజర్ కి కూడా మిశ్రమ స్పందన వస్తోంది.

భోళాశంకర్ టీజర్లో తెలంగాణ యాసలో చిరంజీవి డైలాగ్ డెలివరీ ఆర్టిఫీషియల్ గా ఉందని, ఏ మాత్రం సూట్ కాలేదని ఒక రేంజ్ లో కామెంట్లు వస్తున్నాయి సోషల్ మీడియాలో. రొటీన్ మాస్ మసాలా సినిమా అయిన వేదాళం రీమేక్ కావటం ఒక మైనస్  ఈ క్రమంలో మోహన్ లాల్, కమల్ హాసన్ లాంటి సీనియర్ హీరోలను చూసి అయినా చిరంజీవి ఆలోచనా తీరు మార్చుకోవాలని కామెంట్ చేస్తున్నారు. కమల్ హాసన్ తన వయసుకి తగ్గ పాత్రలను ఎంచుకుంటూ ఆరు పదులు దాటిన వయసులో కూడా శంకర్, మణిరత్నం లతో క్రేజీ ప్రాజెక్ట్స్ ని లైన్ లో పెట్టాడు. ఇక తాజాగా ప్రాజెక్ట్ కె సినిమాలో కమల్ నటిస్తున్నాడన్న అప్డేట్ వచ్చిన తరుణంలో చిరుని టార్గెట్ చేస్తూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు.

ప్రస్తుతం టాలీవుడ్ స్థాయి పాన్ ఇండియా లెవెల్ కి ఎదిగిన క్రమంలో స్టార్ డైరెక్టర్స్ తో భారీ బడ్జెట్ సినిమాలు చేయాల్సిన చిరు యువ దర్శకులకు ప్రాధాన్యం ఇస్తూ వాల్తేరు వీరయ్య, భోళా శంకర్ లాంటి రొటీన్ మాస్ మసాలా సినిమాలు చేయటం ఏంటని అభిమానులు నిరాశ పడుతున్నారు. మరి భోళాశంకర్ కి క్రియేట్ అవుతున్న నెగిటివిటీని చూసాక అయినా చిరు ఆలోచనా తీరులో మార్పు వస్తుందో లేదో చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు