Cibi chakravarthy : నాని పొమ్మంటే, మళ్ళీ శివకార్తికేయన్ రమ్మన్నాడు

Cibi chakravarthy: డాన్ సినిమాతో తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు శిబి చక్రవర్తి. డాన్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన హిట్ గా నిలిచింది. అయితే ఇదే సినిమా తెలుగులో కూడా విడుదలైంది. తెలుగు ఆడియోన్స్ కూడా ఈ సినిమాకు బ్రహ్మరథం పెట్టారు. అయితే సినిమా మీద ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరికి, సినిమాను కెరియర్గా ఎంచుకున్న చాలామందికి ఈ సినిమా పిచ్చిపిచ్చిగా నచ్చింది. ఈ సినిమా తర్వాత శిబి చక్రవర్తికి వరుస అవకాశాలు వస్తాయి అని చాలామంది నమ్మారు. అలానే కొన్ని అవకాశాలు కూడా వచ్చాయి.

నాచురల్ స్టార్ నానితో అవకాశం

తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ప్రస్తుతం నానికి ఉన్న స్థాయి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జెర్సీ సినిమా తర్వాత నాని చేసిన ప్రతి సినిమా కూడా నాని కెరియర్ కి మంచి ప్లస్ అవుతుందని చెప్పొచ్చు. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ కెరియర్ లో ముందుకు వెళ్తున్నాడు నాని. అలానే చాలామంది కొత్త దర్శకులను కూడా ఎంకరేజ్ చేస్తున్నాడు. దసరా సినిమాతో శ్రీకాంత్ ఓదెల అని ఒక కొత్త దర్శకుడుని తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి అందించాడు. ఇప్పుడు మళ్లీ శ్రీకాంత్తో సినిమాను చేస్తున్నాడు నాని. అలానే హాయ్ నాన్న సినిమాతో శౌర్యవ్ అనే ఒక కొత్త దర్శకుడుని తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి అందించాడు. ఇకపోతే డాన్ సినిమా తీసిన శిబి చక్రవర్తికి ఒక అవకాశం కూడా ఇచ్చాడు నాని.

ప్రాజెక్ట్ అందుకే వర్కౌట్ కాలేదు

డాన్ సినిమా తర్వాత శిబి చక్రవర్తి నానికి తన కథను వినిపించాడు. నానికి కూడా ఈ సినిమా కొంతమేరకు బాగానే నచ్చింది. అయితే ఈ సినిమాకు దాదాపుగా 90 కోట్ల వరకు బడ్జెట్ అవుతుందంటూ చెప్పుకొచ్చాడు శిబి చక్రవర్తి. అయితే నాగార్జునతో నా సామిరంగా అనే సినిమాను నిర్మించిన నిర్మాణ సంస్థ ఈ సినిమాను నిర్మించాల్సి ఉంది. కానీ 90 కోట్లు బడ్జెట్ అంటే రిస్క్ అని నానికి తెలిసి ఈ సినిమాను రిజెక్ట్ చేశాడు నాని. ఒక కంటెంట్ నిజంగా బాగుంటే ఆ సినిమాకి 100 కోట్లు కూడా వచ్చే అవకాశం ఉంది అని రీసెంట్ గా వచ్చిన కొన్ని సినిమాలు ప్రూవ్ చేశాయి. బడ్జెట్ పక్కన పెడితే నాని కి కూడా తన కెరీర్లో 100 కోట్ల సినిమా ఉంది. అయితే కథ విషయంలో పూర్తిగా నాని సంతృప్తి చెందకపోవడం వలన ఈ స్క్రిప్ ను రిజెక్ట్ చేశాడని కొందరి అభిప్రాయం.

- Advertisement -

మళ్లీ ఛాన్స్ ఇచ్చిన శివ కార్తికేయన్

ఈ రోజుల్లో ఏ హీరో అయినా ఒక కొత్త దర్శకుడుని నమ్మడం అనేది మామూలు విషయం కాదు. అయితే ఆ దర్శకుడిని నమ్మి సినిమా చేసి హిట్టు కొడితే, ఒక హిట్ సినిమాతో పాటు ఒక మంచి దర్శకుడుని ఇండస్ట్రీకి అందించాము అనే సాటిస్ఫాక్షన్ హీరోలకు ఉంటుంది. అలానే డాన్ సినిమాతో ఒక మంచి దర్శకుడుని తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీకి అందించాననే సంతృప్తి శివ కార్తికేయన్ కి ఉంది. ఇకపోతే నాని రిజెక్ట్ చేసిన కథతో ప్రస్తుతం శివకార్తికేయన్ సినిమా చేయనున్నాడు. ఇక ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత దాని ఫలితాన్ని బట్టి నాని జడ్జ్మెంట్ మీద చాలామందికి ఒక క్లారిటీ వస్తుంది.

Sivakarthikeyan and Rashmika Mandanna teaming up?

శివ కార్తికేయన్ సరసన

అయితే శిబి చక్రవర్తి దర్శకత్వంలో శివ కార్తికేయన్ చేస్తున్న సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటించబోతున్నట్లు తెలుస్తోంది. రీసెంట్ టైమ్స్ లో రష్మిక మంచి గుర్తింపును సాధించుకుంది. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వచ్చిన అనిమల్ సినిమా రష్మికకు పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపును తీసుకొచ్చింది. ఇకపోతే ఈ సినిమాను ఫ్యాషన్ స్టూడియోస్ నిర్మిస్తుంది. ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ త్వరలో రానున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు