Committee Kurrollu : నిహారిక మూవీకి ఇంకా బిజినెస్ అవ్వలేదా..? ఇలాగైతే కష్టమే..

Committee Kurrollu : ప్రస్తుతం రాబోతున్న చిన్న సినిమాల్లో కొంతమేరకు మంచి ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేసిన సినిమా కమిటీ కుర్రాళ్ళు. ఈ సినిమాతో చాలామంది యూట్యూబర్స్ వెండి తెరపై కనిపించనున్నారు. ఈ సినిమాను మెగా ప్రిన్సెస్ నిహారిక నిర్మిస్తున్నారు. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పాటలు టీజర్, ట్రైలర్ విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాతో అనుదీప్ దేవ్ సంగీత దర్శకుడుగా మారాడు. యాదు వంశీ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇకపోతే ఆగస్టు 9న ఈ సినిమా రిలీజ్ కాబోతున్నట్లు ఇదివరకే అధికారికంగా ప్రకటించింది చిత్ర యూనిట్.

ఈ రోజుల్లో ఒక మంచి సినిమాను తీయడం కంటే ఆ సినిమాను జనాల్లోకి తీసుకెళ్లడం అసలైన టాస్క్. ఎంత మంచి సినిమా తీసిన కూడా దానికి సరైన ప్రజాదరణ దక్కకపోతే ఆ సినిమా అలానే మిగిలిపోతుంది. ఇలా ఎన్నో సినిమాలు థియేటర్లో మిస్సయిన వాళ్లు ఓటీటీలో చూసి ఎంజాయ్ చేశారు. కొన్ని సినిమాలు ఓటీటీ లో చూసిన తర్వాత ఇంత మంచి సినిమాను థియేటర్లో మిస్ అయ్యామా అని అభిప్రాయం కలుగుతుంది. కమిటీ కుర్రాళ్ళ విషయానికి వస్తే ఈ సినిమాలో చాలా నోస్ట్రాలజియా మూమెంట్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఈ సినిమా మ్యూజిక్ మంచి హిట్ అయింది. అయినా కానీ ఈ సినిమాకి సంబంధించి బిజినెస్ ఇంకా జరగలేదని సమాచారం.

Committee Kurrollu

- Advertisement -

ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్న నిహారిక విషయానికి వస్తే. మొదటి బుల్లితెరలు యాంకర్ గా కొన్ని సోషల్ లో కనిపించి ఆ తర్వాత ఒక మనసు సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత చేసిన సినిమాలు కూడా పెద్దగా వర్కౌట్ కాలేదు. ఆ తర్వాత ప్రొడక్షన్స్ లోకి దిగింది. ఇక ఓటిటి ప్లాట్ఫార్మ్స్ లో తీసిన కొన్ని సినిమాలకి మంచి పేరు కూడా వచ్చింది. ఇక నిర్మాతగా కమిటీ కుర్రాళ్ళు అనే సినిమాను తెరకెక్కించారు నిహారిక. ఇకపోతే ఈ సినిమాకి ఇంకా బిజినెస్ జరగలేదు అని తెలుస్తుంది.కమిటీ కుర్రాళ్ల మూవీకి ఇప్పటి వరకు ఓటీటీ బిజినెస్ అవ్వలేదట. అండ్ థియేట్రికల్ బిజినెస్ కూడా ఇప్పటి వరకు కాలేదట. నిర్మాతలు స్పందిస్తే గాని దీనిపైన ఒక క్లారిటీ రాదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు