Coolie Update: రజినీకాంత్ మూవీని రిజెక్ట్ చేసిన నాగ్… మరీ ఈ కండీషన్ పెడతారా?

Coolie Update : ప్రస్తుతం చాలామంది సీనియర్ హీరోలు విలన్లుగా టర్న్ అయ్యి, సిల్వర్ స్క్రీన్ ను ఏలుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ కింగ్ నాగార్జున కూడా విలన్ గా అవతారం ఎత్తబోతున్నాడని గత రెండు రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. కానీ తాజాగా ఆయన ఆ ఆఫర్ ను రిజెక్ట్ చేశాడనే వార్త తెరపైకి వచ్చింది.

రజినీ మూవీని రిజెక్ట్ చేసిన నాగ్

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ “కూలీ”. బంగారం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్, ట్రైలర్ ను రీసెంట్ గా రిలీజ్ చేయడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ సినిమాలో విలన్‌గా నటించడానికి సీనియర్ తెలుగు హీరో నాగార్జున అక్కినేనిని సంప్రదించినట్లు ఫిల్మ్ నగర్‌ సర్కిల్స్ లో జోరుగా ప్రచారం జరుగుతోంది. సినిమాలో రజనీకి విలన్‌గా నటించమని నాగార్జునను లోకేష్ సంప్రదించినట్లు సమాచారం.

అయితే ఇప్పటికే విజయ్ సేతుపతి, సంజయ్ దత్ వంటి స్టార్స్ ను లోకేష్ కనగరాజ్ పవర్ ఫుల్ విలన్లుగా చూపించడంలో సక్సెస్ అయ్యారు. ఇలా విజయవంతంగా నెగిటివ్ రోల్స్‌లో స్టార్ హీరోలను చూపించిన ట్రాక్ రికార్డ్ ఉన్నందున, ప్రసిద్ధ నటులను విరోధి పాత్రలలో నటించేలా చేసిన లోకేష్‌కు ఉన్న ఖ్యాతిని బట్టి నాగార్జున కూడా ఈజీగా ఈ ఆఫర్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడని చాలా మంది భావించారు. ఇన్సైడ్ వర్గాల సమాచారం ప్రకారం మొదట ఆసక్తి ఉన్నప్పటికీ నాగార్జున లోకేష్ ఆఫర్‌ను తిరస్కరించినట్లు తెలుశత్వనది. ప్రస్తుతం చేస్తున్నది తక్కువ సినిమాలే అయినప్పటికీ నా సామి రంగా వంటి హిట్ కొట్టి, హీరోగా మంచి ఫామ్ లో ఉన్నాడు నాగ్. అలాంటిది తాను అనవసరంగా విలన్ పాత్ర చేయనవసరం లేదని అనుకుంటున్నారట. ఒకవేళ నాగ్ ఈ సినిమా చేస్తే అది స్టార్-హీరో కేటగిరీ నుంచి ఆయనను పక్కన పెట్టే ఛాన్స్ కు దారి తీసే ఛాన్స్ ఉంది.

- Advertisement -

Did Nagarjuna rejects the villain's role in Rajinikanth, Lokesh Kanagaraj's Coolie?

నాగార్జున క్రేజీ లైనప్

నాగార్జున ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ హీరోగా నటిస్తున్న క్రేజీ మల్టీస్టారర్ ప్రాజెక్ట్ “కుబేర” షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. అంతే కాకుండా తనకు ఈ సంక్రాంతికి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన నా సామి రంగ దర్శకుడు విజయ్ బిన్ని దర్శకత్వంలో మరో సినిమా కూడా చేస్తున్నాడు. అంతేకాకుండా బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 8ను మరోసారి హోస్ట్ చేయనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రోమో రిలీజ్ కాగా, కంటెస్టెంట్లు వీళ్లేనంటూ పుకార్లు తెగ షికార్లు చేస్తున్నాయి. కాగా ఇప్పుడు కొత్త సీజన్ కోసం నాగార్జున 30 కోట్ల పారితోషికం అందుకుంటున్నారని టాక్ నడుస్తోంది. దీంతో ఇంత బిజీగా ఉన్న నాగ్ ను మరీ విలన్ క్యారెక్టర్ చేయమని ఎలా అడుగుతారు? ఆయన రిజెక్ట్ చేసి మంచి పని చేశాడు అంటున్నారు అక్కినేని ఫ్యాన్స్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు