Ntr -prasanth Neel : ఏంటయ్యా ప్రశాంత్ నీల్.. మా ఎన్టీఆర్ ను ఏం చెయ్యాలనుకుంటున్నావ్..

Ntr -prasanth Neel : గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాలో నటిస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.. ఆ సినిమాను డిసెంబర్ లో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. అంతేకాదు బాలీవుడ్ లో కూడా మరో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ కాంబోలో ఓ సినిమా చేస్తున్నాడు.. ఆ సినిమా కోసం ఫ్యాన్స్ ఈగర్ వెయిట్ చేస్తున్నారు.. ఈ సినిమా నుంచి తాజాగా అదిరిపోయే న్యూస్ ఒకటి వినిపిస్తుంది..

ఎన్టీఆర్ దేవర, బాలీవుడ్ వార్ 2 సినిమాలు అయ్యాక నెక్స్ట్ మూవీకి కమిట్ అయిన సంగతి తెలిసిందే.. ఆ సినిమాలో ఎన్టీఆర్ తన సినీ లైఫ్ లో ఎప్పుడూ చెయ్యని పాత్రలో కనిపించబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.. అటువంటి కొత్త పాత్రలో ఎన్టీఆర్ కనిపించబోతున్నారట.. ఈ సినిమాలో డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నారని వార్త ఇండస్ట్రీలో వినిపిస్తుంది.. ఇది విన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.. ఏంటయ్యా ప్రశాంత్ నీల్ మా ఎన్టీఆర్ ను ఏం చెయ్యాలనుకుంటున్నావ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.. ఇక సినిమాలో ఓ పాత్రలో మాఫియా డాన్‌గా ఎన్టీఆర్‌ ను చూపించబోతున్నారని టాక్‌ వినిపిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌లో భారీ బడ్జెట్‌తో నిర్మించనున్న ఈ సినిమా సెప్టెంబర్‌లో సెట్స్‌పైకి వచ్చే అవకాశం ఉందని సమాచారం..

Crazy update from NTR Prashant Neel movie.. Shocking comments from fans
Crazy update from NTR Prashant Neel movie.. Shocking comments from fans

ఇకపోతే ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర షూటింగ్‌ పనుల్లో బిజీగా ఉన్నారు. అది చివరి దశకు చేరుకున్న విషయం తెలిసిందే.. డిసెంబర్ లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది.. ఇక బాలీవుడ్‌ సినిమా వార్‌-2లోనూ ఎన్టీఆర్‌ నటిస్తున్న విషయం తెలిసిందే. హృతిక్ రోషన్‌తో కలిసి వార్‌-2 చిత్రంలో ఎన్టీఆర్ కనిపించబోతున్నారు. ఎన్టీఆర్ లైనప్‌లో తర్వాత ఉన్న మూవీనే డ్రాగన్‌. ఈ సినిమా షూటింగ్‌ కూడా రెండు నెలల్లో ప్రారంభం కాబోతుండటంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఈ సినిమా కోసం ప్రశాంత్ నీల్ బాలీవుడ్ హీరోయిన్ ను దించబోతున్నారని టాక్.. మరి అది ఎంతవరకు నిజమో తెలియాలంటే అఫిషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేవరకు ఆగాల్సిందే..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు