Darshan : చిక్కుల్లో పడ్డ తెలుగు డైరెక్టర్… దర్శన్ నిజస్వరూపం తెలియక కమిట్మెంట్

Darshan : లైఫ్ ఈజ్ అన్ ప్రెడిక్టబుల్ అంటారు ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు ఊహించలేరు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక మంచి దర్శకుడుగా పేరు ఉన్న శ్రీకాంత్ అడ్డాల అనుకోకుండా ఒక పెద్ద సమస్యలో చిక్కుకుపోయాడు. కనుమరుగైపోతున్న విలువలను, మంచితనాన్ని తన సినిమాల్లో ఎప్పటికప్పుడు చూపిస్తూ ఉంటాడు శ్రీకాంత్ అడ్డాల. నారప్ప పెద్దకాపు సినిమాలు మినహాయిస్తే ఇప్పటివరకు శ్రీకాంత్ అడ్డాల చేసిన సినిమాలన్నీ కూడా ఫ్యామిలీతో అందరూ హాయిగా చూసి ఎంజాయ్ చేయగలిగేలా ఉంటాయి. ఫ్యామిలీ వాల్యూస్ కూడా శ్రీకాంత్ అడ్డాల సినిమాలో అద్భుతంగా ఉంటాయి.

కొత్త బంగారులోకం సినిమాతో దర్శకుడుగా పరిచయమైన శ్రీకాంత్ అడ్డాల రెండవ సినిమానే మల్టీస్టారర్ చేశాడు. వెంకటేష్, మహేష్ బాబు వంటి స్టార్ హీరోలను డీల్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఆ సినిమా తర్వాత మెగా హీరోను తెలుగు సినిమా పరిశ్రమకు లాంచ్ చేసే బాధ్యతలను చేపట్టి సక్సెస్ఫుల్ గా అచీవ్ చేశాడు. వరుణ్ తేజ్ హీరోగా పరిచయమైన ముకుంద సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఆ తర్వాత చేసిన బ్రహ్మోత్సవం భారీ డిజాస్టర్ అయింది. ఆ సినిమా తర్వాత శ్రీకాంత్ అడ్డాలకు సినిమా చేయటానికి చాలా రోజులు టైం పట్టింది. మొత్తానికి వెంకటేష్ అసురన్ సినిమా రీమిక్ చేసి మళ్లీ బౌన్స్ బ్యాక్ ఇచ్చాడు.

Srikanth Addala

- Advertisement -

ఇక రీసెంట్ గా పెద్దకాపు అనే సినిమాతో మళ్లీ ప్రేక్షకులు ముందుకు వచ్చాడు శ్రీకాంత్ అడ్డాల. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన విజయాన్ని సాధించుకోలేకపోయింది. ఇకపోతే శ్రీకాంత్ అడ్డాల ఒక కన్నడ హీరో తో షూటింగ్ మొదలుపెట్టి సినిమా చేసినట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అతను మరెవరో కాదు ఈ మధ్యన సంచలమైన కేసులో A1 గా ఉన్న దర్శన్. తన సొంత అభిమాని రేణుక స్వామి హత్య కేసులో కీలక పాత్రను పోషించాడు దర్శన్. ఇప్పుడు దర్శనపై తీవ్రస్థాయిలో నెగెటివిటీ ఉంది. అయితే ఇది జరగడానికంటే ముందు దర్శన్ తో కొంతమేరకు సినిమా కూడా షూటింగ్ చేశాడట శ్రీకాంత్ అడ్డాల. మంచితనానికి మారుపేరుగా ఉన్న శ్రీకాంత్ అడ్డాల ఇటువంటి క్రిమినల్ తో సినిమా చేయటం ఏంటి అని సినీ వర్గాల్లో చర్చలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా ఆ హీరో నిజస్వరూపం తెలియక చిక్కుల్లో పడిపోయాడు శ్రీకాంత్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు