Dasari – NTR : దాసరి- ఎన్టీఆర్ మధ్య విభేదాలు రావడానికి కారణం..?

ఒకప్పుడు తెలుగు సినిమా పరిశ్రమకు వెన్నెముక గా నిలిచిన దర్శకుడు దాసరి నారాయణరావు, ప్రముఖ దిగ్గజ నటులు ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇకపోతే సినిమా రంగంలో నందమూరి తారకరామారావుకి పెద్దగా శత్రువులు ఎవరు ఉండేవారు కాదు . అందరితో ఆయన స్నేహం గానే కలిసిపోయేవారు. అయితే దర్శకరత్న దాసరి నారాయణరావు గారు మొదట్లో ఎన్టీఆర్ కు ప్రాణ మిత్రులుగా ఉన్నా కొన్ని కారణాలవల్ల ఇద్దరూ బద్ధ శత్రువులుగా మారిపోయారు. అలా వీరిద్దరి మధ్య విభేదాలు రావడానికి గల కారణం మాత్రం ఎవరికీ తెలిసేది కాదు.

ఇకపోతే ప్రాణ స్నేహితులుగా ఇండస్ట్రీలో ఒకరికొకరు సినిమాలు తీసి మంచి పేరు దక్కించుకున్న వీరిద్దరూ ఇలా విభేదాలు వచ్చి విడిపోవడానికి గల కారణం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

దాసరి నారాయణరావు.. ఎన్టీఆర్ తో చాలా సన్నిహితంగా ఉండేవారు. అలా వీరిద్దరి కాంబినేషన్లో బొబ్బిలి పులి, సర్దార్ పాపారాయుడు వంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి. అయితే ఈ సినిమాలు అన్నగారిని రాజకీయంగా ప్రేరేపించాయని చెప్పవచ్చు. అంతేకాదు చిన్నతనం నుంచి దాసరికి ఏఎన్నార్ అంటే చాలా అభిమానం ఉండేదట..

- Advertisement -

ఆ తర్వాత ఏఎన్నార్ తో గ్యాప్ రావడం వల్లే ఎన్టీఆర్ తో దాసరి బంధం ఏర్పరచుకున్నారు.p ఆ తర్వాత కొంతకాలానికి వీరిద్దరి మధ్య కూడా వైరం పెరిగిపోయింది.అంతేకాదు అదే సమయంలో దాసరికి షూటింగ్ కోసం స్టూడియోలు ఇవ్వద్దని ఎన్టీఆర్ కొంతమందికి చెప్పే వరకు కూడా వెళ్లిందట . ఇకపోతే అన్నగారితో ఎన్నో సినిమాలు తీసిన దాసరికి ఇలాంటి పరిస్థితులు వస్తాయని..

ఆనాడు ఎవరు ఊహించనేలేదట. అయితే దీనంతటికీ కారణం రాజకీయమని సమాచారం. దాసరి కాంగ్రెస్ పార్టీలో ఇందిరమ్మ ఫ్యాన్. ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు ఆయనకు వ్యతిరేకంగా ఇందిరమ్మ దాసరికి ఆఫర్ ఇచ్చారని.. అంతే కాదు ఈనాడులో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా కథనాలు వస్తే దాసరి ఉదయం పత్రికను స్థాపించి ఎన్టీఆర్ కి వ్యతిరేకంగా వార్తలు రాయించి ఆయనను రెండోసారి ఓడించడానికి కూడా దాసరి కారణమయ్యాడని కూడా అప్పట్లో జోరుగా ప్రచారం జరిగింది.

ఇక అలా ఈ ఒక్క రాజకీయ పార్టీ కారణం వల్లే ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయని సమాచారం. ఏది ఏమైనా ఒకప్పుడు ప్రాణ స్నేహితులుగా ఉన్న ఎన్టీఆర్ , దాసరి ఇలా రాజకీయ పార్టీలకు బలవుతారని.. వారి స్నేహాన్ని అడ్డుగా పెడతారని ఎవరు ఊహించలే.
Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు