Deepika Padukone : పుట్టబోయే బిడ్డ కోసం దీపికా షాకింగ్ నిర్ణయం… ఆ హీరోయిన్లందరికీ బుద్ధి రావాల్సిందే

Deepika Padukone : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె ప్రస్తుతం కల్కి 2898 ఏడీ మూవీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తోంది. ఇక త్వరలో తల్లి కాబోతున్న ఈ బ్యూటీ తనకు పుట్టబోయే బిడ్డ విషయంలో సంచలన నిర్ణయం తీసుకుందట. ఈ విషయం తెలిసిన నెటిజన్లు దీపికాను చూసి ఆ హీరోయిన్లంతా బుద్ధి తెచ్చుకోవాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి దీపికా తీసుకున్న ఆ నిర్ణయం ఏంటో తెలుసుకుందాం పదండి.

బిడ్డ కోసం మంచి నిర్ణయం

దీపికా పదుకొణె సెప్టెంబర్‌లో తన మొదటి బిడ్డకు ఆమె జన్మనివ్వనుంది. ప్రస్తుతం ఈ భామ ఏ సినిమాలోనూ నటించకూడదని నిర్ణయించుకుంది. ప్రెగ్నెన్సీ కారణంగా గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తున్న దీపిక బిడ్డ విషయంలో ఓ పెద్ద నిర్ణయం తీసుకుంది. దీపికా తల్లి అయిన వెంటనే మళ్లీ సినిమాలు స్టార్ట్ చేయనుందని వార్తలు వచ్చాయి. కానీ తాజా సమాచారం ప్రకారం ఆమె తన బిడ్డతో ఎక్కువ సమయం గడపాలని కోరుకుంటుందని టాక్ నడుస్తోంది. నిజానికి దీపికా ఎవరి సహాయం లేకుండానే తన బేబీని చూసుకుంటుందని అంటున్నారు. అంటే ఇతర సెలబ్రిటీల మాదిరిగా దీపికా బిడ్డను చూసుకోవడానికి నానీని పెట్టుకోదు. అంతేకాదు తల్లి అయిన తర్వాత దీపిక తన భర్త రణవీర్ సింగ్ నుండి కూడా సహాయం తీసుకోదని తెలుస్తోంది. ఎందుకంటే ఆమె తన బిడ్డకు కావాల్సిన ప్రతి విషయాన్ని తానే స్వయంగా చేయాలనుకుంటుంది.

Mom-To-Be Deepika Padukone Flaunts Baby Bump For First Time

- Advertisement -

దీపికా సన్నిహితులు ఇచ్చిన సమాచారం ప్రకారం దీపికకు పిల్లలంటే చాలా ఇష్టం. అంతేకాకుండా ఆమె వెంటనే పిల్లలతో కలిసిపోతుంది. కాబట్టి దీపికా తన బిడ్డను ఒంటరిగా చూసుకోగలదు. ఈ హీరోయిన్ కు పుట్టబోయే బిడ్డను చూసుకునే నానీ ఎవరు ఉండరు. దీపిక రణబీర్, అతని తల్లిదండ్రుల నుండి కూడా సహాయం తీసుకుంటుందని నేను అనుకోను. దీపిక 100 శాతం గొప్ప తల్లి కావచ్చు అని ఆమె సన్నిహితులు తెలిపారు. దీంతో కోట్ల ఆస్తి ఉన్నప్పటికీ బిడ్డను నానీ (కేర్ టేకర్) చేతిలో పెట్టేసే హీరోయిన్లు దీపికాను చూసి బుద్ధి తెచ్చుకోవాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

హాలీవుడ్ ఛాన్స్ ను వదులుకున్న దీపికా

దీపికా పదుకొణె, రణ్‌వీర్‌ సింగ్ మార్చి నెలలో తాము తల్లిదండ్రులం కాబోతున్నామని సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించారు. అంతేకాకుండా దీపిక చాలా చోట్ల తన బేబీ బంప్‌ను ప్రదర్శించింది. అయితే ప్రెగ్నెన్సీ కారణంగా దీపిక అంతర్జాతీయ వెబ్ సిరీస్ ‘ది వైట్ లోటస్’ మూడవ సీజన్‌ ఆఫర్ ను కూడా తిరస్కరించింది. ఆమె తనకు పుట్టబోయే శిశువును జాగ్రత్తగా చూసుకోవడానికి ఈ సిరీస్‌ను తిరస్కరించిందని తెలుస్తోంది. అంతేకాదు ప్రస్తుతం ఆమె ఎలాంటి కొత్త ప్రాజెక్ట్‌కు కూడా సంతకం చేయడం లేదని సమాచారం. కాగా ఓ పాత ఇంటర్వ్యూలో దీపికా ముగ్గురు పిల్లలకు తల్లిని కావాలనుకుంటున్నాను అంటూ తల్లి కావాలనే కోరికను వ్యక్తం చేసింది. అంతేకాదు దీపికతో పెళ్లి తర్వాత ఓ కూతురికి తండ్రి కావాలనే కోరికను రణ్‌వీర్ బయటపెట్టాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు