Deepika Padukone: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన దీపిక.. కృష్ణయ్య వచ్చేసాడుగా.?

Deepika Padukone.. ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే (Deepika Padukone)బాలీవుడ్ లో స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకోవడమే కాదు అక్కడ అత్యధిక పారితోషకం తీసుకుంటున్న హీరోయిన్ గా కూడా రికార్డు సృష్టించింది. ముఖ్యంగా ఒక్కో చిత్రానికి రూ.10 కోట్లకు పైగా పారితోషికం తీసుకుంటూ అలరిస్తున్న ఈమె ఇటీవల ప్రభాస్ (Prabhas)హీరోగా , నాగ్ అశ్విన్ (Nag Ashwin)దర్శకత్వంలో కల్కి 2898AD సినిమాలో హీరోయిన్ గా నటించింది. అంతేకాదు ఈ సినిమాతో తొలిసారి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఈ సినిమాలో గర్భవతిగా నటించిన విషయం తెలిసిందే.

Deepika Padukone: Deepika who gave birth to Pandanti's baby.
Deepika Padukone: Deepika who gave birth to Pandanti’s baby.

కల్కి వచ్చేసాడు..

ఇక సినిమాలోనే కాదు నీ జీవితంలో కూడా దీపికా పదుకొనే ప్రెగ్నెంట్. ప్రస్తుతం ఈమెకు ఎనిమిదవ నెల. అయితే తాజాగా ఈమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది అంటూ ఒక వార్త తెరపైకి వచ్చింది. అంతే కాదు హాస్పిటల్ బెడ్ పై డెలివరీ తర్వాత తన బిడ్డను గుండెలకు హత్తుకున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. కృష్ణయ్య వచ్చేసాడు, కల్కి పుట్టాడు అంటూ అభిమానులు రకరకాల కామెంట్లు చేస్తున్నారు , అయితే రన్వీర్ సింగ్ , దీపికా పదుకొనే జంట నుంచి ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడ లేదు. కానీ ప్రస్తుతం వీరిద్దరూ అబ్బాయికి జన్మనిచ్చారు అంటూ ఒక వార్త తెరపైకి వచ్చింది.

రెండేళ్ల పాటు ఇండస్ట్రీకి దూరం..

దీపికా పదుకొనే విషయానికి వస్తే.. డెలివరీ తర్వాత రెండు సంవత్సరాల పాటు సినిమా ఇండస్ట్రీకి దూరం కానుంది అంటూ గతంలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ముఖ్యంగా పుట్టిన బిడ్డ యొక్క అలనా పాలన చూసుకోవడానికి ఇలాంటి నిర్ణయం తీసుకుందని సమాచారం. అందులో భాగంగానే దాదాపు రెండు సంవత్సరాల పాటు కల్కి సీక్వెల్ కూడా వాయిదా పడబోతోందని తెలుస్తోంది. ముఖ్యంగా కల్కి సీక్వెల్ లో దీపికా పదుకొనే పాత్ర అత్యంత ప్రాధాన్యత సంతరించుకుందట. అందుకే ఆమెను ఈ సినిమాలో భాగం చేయడం కోసం మరో రెండు సంవత్సరాలు చిత్ర బృందం ఎదురు చూడాల్సిందే అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం దీపిక డెలివరీ అయిందని, కొడుకు పుట్టాడు అంటూ వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ఈ విషయంపై కుటుంబ సభ్యులు అధికారిక ప్రకటన ఇచ్చేవరకు ఎదురుచూడక తప్పదు.

- Advertisement -

దీపికా కెరియర్..

ఇక దీపికా పదుకొనే విషయానికి వస్తే.. 1986 జనవరి ఐదున జన్మించిన దీపికా పదుకొనే 2023 నాటికి భారత దేశంలో అత్యధిక పారితోషకం తీసుకుంటున్న నటి గా పేరు సొంతం చేసుకుంది. కానీ నటనతో విమర్శకుల ప్రశంసలతో పాటు మూడు ఫిలింఫేర్ అవార్డులు కూడా అందుకుంది. బ్యాడ్మింటన్ క్రీడాకారుడు ప్రకాష్ పదుకొనే కుమార్తె అయిన ఈమె యుక్తవయసులోనే జాతీయస్థాయి ఛాంపియన్షిప్ బ్యాడ్మింటన్ లో కూడా ఆడింది. ఇక వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈమె 2008 లో రణబీర్ కపూర్ తో ఎఫైర్ పెట్టుకునీ.. ఆ తరువాత కొన్ని కారణాలవల్ల అతడికి బ్రేకప్ చెప్పేసింది. తర్వాత 2017 లో 2012 నుంచి రణవీర్ సింగ్ తో ప్రేమలో ఉన్నానంటూ తెలిపిన ఈమె 2018లో వివాహం చేసుకున్నారు. ఇక ఇప్పుడు పండంటి కొడుకుకు జన్మనిచ్చినట్లు తెలుస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు