Devara: ఏపీలో జరిగిన ఆ విషాద గాథ ఆధారంగా మూవీ… నిజమా దేవరా?

Devara : ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రాలలో దేవర : పార్ట్ 1 ఒకటి. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన సాంగ్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. అయితే తాజాగా దేవర మూవీ స్టోరీకి సంబంధించిన ఒక కీలక సమాచారం నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ సినిమా స్టోరీ ఏపీలో జరిగిన ఓ విషాద సంఘటనను బేస్ చేసుకుని తెరకెక్కింది అనేది దాని సారాంశం. మరి దేవర స్టోరీ ఏ వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కింది ? అనే ఇంట్రెస్టింగ్ విషయంపై ఓ లుక్కేద్దాం పదండి.

దేవర స్టోరీ ఇదేనా?

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ దేవర. బాలీవుడ్ దివా జాన్వి కపూర్ ఈ మూవీతోనే టాలీవుడ్ లోకి అడుగు పెడుతోంది. సైఫ్ అలీఖాన్ కూడా మొదటిసారి దేవర మూవీతో సౌత్ ఆడియన్స్ ను పలకరించనున్నారు. ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. ఈ నేపథ్యంలోనే తాజాగా దేవర స్టోరీ ఇదేనంటూ ఓ వార్త షికారు చేస్తోంది. పాన్ ఇండియా మూవీ కావడంతో నేషనల్ మీడియా సైతం దేవర స్టోరీ ఇదేనంటూ కథనాలు పోస్ట్ చేస్తుండడం విశేషం. ఇక తాజా అప్డేట్ ప్రకారం దేవర మూవీ స్టోరీ ఆంధ్రప్రదేశ్‌లోని వేలాది మంది ప్రజలను ప్రభావితం చేసిన నిజ జీవిత విషాద సంఘటన నుండి ప్రేరణ పొందిందని తెలుస్తోంది.

Is Jr NTR’s Devara based on a real-life tragic incident? Know details (PC: Devara Movie on X)

- Advertisement -

ఎప్పటిలాగే డైరెక్టర్ కొరటాల ఈసారి కూడా దేవరతో ఓ రియల్ స్టోరీని బేస్ చేసుకుని దేవరను తెరపైకి తీసుకురాబోతున్నాడు అంటున్నారు. 1985లో ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన విషాదకరమైన కారంచేడు ఊచకోత ఆధారంగా దేవర రూపొందుతోందని టాక్ నడుస్తోంది. దళితులు లేదా మాదిగలపై కమ్మ భూస్వాములుగా పిలవబడే ఉన్నత హిందూ కులాల ప్రజల క్రూరత్వం పెరిగిపోయి, ఆ తరువాత కారంచేడు ఊచకోతకు దారి తీసింది. ఈ విషాద ఘటనలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే తీవ్ర గాయాల పాలయ్యారు. అంతేకాదు ఈ భయంకరమైన సంఘటనలో చాలా మంది ప్రాణాలను అరచేత పట్టుకుని భయంతో రాత్రికి రాత్రే తమ ఇళ్లను వదిలి వెళ్లేలా చేశారు. ఈ సంఘటన రాష్ట్ర సామాజిక నిర్మాణంపై శాశ్వతంగా బాధాకరమైన ముద్ర వేసింది. దీన్నే ఇన్స్పిరేషన్ గా తీసుకుని కొరటాల దేవరను చెక్కుతున్నాడని అంటున్నారు. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే మూవీ రిలీజ్ అయ్యేదాకా ఆగాల్సిందే.

కొరటాలకు అదే ప్లస్ పాయింట్

దర్శకుడు కొరటాల శివ తన చిత్రాలలో అనేక నిజ జీవిత చారిత్రక సంఘటనల నుండి ప్రేరణ పొందడంలో సూపర్ స్కిల్డ్ పర్సన్ అని చెప్పవచ్చు. శ్రీమంతుడు, ఆచార్య వంటి ఆయన ఇతర చిత్రాలలో ఇది స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు దేవరకు కూడా తనలో ఉన్న ఈ స్పెషల్ ప్లస్ పాయింట్ ను వాడుతున్నాడు అనే ప్రచారం జరుగుతోంది. కాగా ఈ ఏడాది సెప్టెంబర్ 27 న దేవర ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు