Devara: దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్.. చీఫ్ గెస్ట్ ఎవరంటే..?

Devara.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) ఆర్ఆర్ఆర్(RRR ) చిత్రంతో ఊహించని సొంతం చేసుకొని, ఇప్పుడు అదే రేంజిలో సినిమాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే జనతా గ్యారేజ్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న ఈయన, అదే డైరెక్టర్ తో మరొకసారి సినిమా చేయడానికి ముందుకు వచ్చారు.అదే దేవర (Devara) . ఇప్పుడు ఎన్టీఆర్ , కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న ఈ దేవర చిత్రం రెండు భాగాలుగా రాబోతోంది. ఈ నేపథ్యంలోనే మొదటి భాగం సెప్టెంబర్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో అప్పుడే ప్రమోషన్స్ జోరుగా చేపట్టారు చిత్ర బృందం.

Devara: Devara pre release event.. Who is the chief guest..?
Devara: Devara pre release event.. Who is the chief guest..?

ఇక తాజాగా సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించబోతున్నారు. ముంబైలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి ఒకరోజు ముందే చేరుకున్న ఎన్టీఆర్ అప్పుడే పనులు మొదలుపెట్టేశారు. అందులో భాగంగానే అక్కడ మీడియాకి విస్తృతంగా ఇంటర్వ్యూలు ఇస్తూ కొన్ని విషయాలు అభిమానులతో పంచుకుంటున్నారు ఎన్టీఆర్. ఇదిలా ఉండగా ఆర్ఆర్ఆర్ సినిమా తీసుకొచ్చిన గుర్తింపుతో పాటు బాలీవుడ్ లో హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్న వార్ 2 చిత్రం లో కూడా నటిస్తూ బాలీవుడ్ ప్రేక్షకులకు నేరుగా దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే తాను నటించబోయే దేవర సినిమాకు సంబంధించి ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని ముంబైలో చేయబోతున్నారు.

నిజానికి హృతిక్ రోషన్ తో ఎన్టీఆర్ కలిపి నటించబోతున్న సినిమా మీద బాలీవుడ్ వర్గాలలో అంచనాలు లేవు. రాజమౌళి , ప్రశాంత్ నీల్ తప్ప ఇంకెవరు నార్త్ మార్కెట్లో జెండా పాత లేరు అనే పరిస్థితుల్లో కొరటాల శివ దాన్ని చేసి చూపిస్తారనే నమ్మకం ఎన్టీఆర్ అభిమానులలో బలంగా కనిపిస్తోంది. అందుకే ప్రేమగా ఒకరికొకరు బావ అని పిలుచుకునే జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ మధ్య ఒక సరదా ఇంటర్వ్యూ ప్లాన్ చేసినట్లు తెలిసింది. దేవరతో పుష్ప జుట్టు కడితే ముచ్చట్లు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ప్రస్తుతం బన్నీ డేట్ అందుబాటును బట్టి ఏదో ఒక రోజు దీన్ని ప్లాన్ చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి.

- Advertisement -

అంతేకాదు ఒకవేళ అన్ని కుదిరితే ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి బన్నీ ముఖ్యఅతిథిగా వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మరోవైపు బన్నీ తాను నటించబోయే పుష్ప 2 సినిమా షూటింగ్ లో బిజీ గా వున్నారు. మరి బన్నీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి ముఖ్యఅతిథిగా వస్తారా..? లేక ఒకరోజు విడిగా ఇద్దరి మధ్య ఇంటర్వ్యూ కుదురుస్తారా? అనే విషయం తెలియాల్సి ఉంది. ఒకవేళ ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి బన్నీ రాకపోతే కనీసం ప్రీ రిలీజ్ ఈవెంట్ కైనా పిలిపించే ప్రయత్నం చేస్తున్నారు నిర్వాహకులు. ఇకపోతే దేవర పుష్ప రాజ్ ఇద్దరు కలిస్తే చూడాలని అభిమానులు కూడా ఎదురు చూస్తున్నారు. మరి ఇందులో ఏ విషయాన్ని బన్నీ నిజం చేస్తారో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు