Devara : అప్పుడూ.. ఇప్పుడూ.. రెండో సాంగ్ ఎప్పుడు?

Devara : టాలీవుడ్ లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ క్రేజీ చిత్రాల్లో ‘దేవర’ ఒకటి. గత నెలలో కల్కి2898AD వంటి భారీ ప్రాజెక్ట్ రిలీజ్ అయిపోగా, నెక్స్ట్ రాబోయే బిగ్ ప్రాజెక్ట్ దేవర నే కావడంతో మూవీ లవర్స్ అందరి చూపు దీనిపైనే ఉంది. ఈ సినిమాని కూడా మొదట సమ్మర్ లోనే రిలీజ్ కి ప్లాన్ చేయగా, షూటింగ్ డిలే వల్ల వాయిదా పడుతూ వస్తుంది. ఇక ఈ సినిమా కోసం నందమూరి అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలో జనతా గ్యారేజ్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తుండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నందమూరి కళ్యాణ్ రామ్ ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తుండగా ఈ సినిమా ఫస్ట్ పార్ట్ సెప్టెంబర్ 27న రిలీజ్ అవుతుందని మేకర్స్ అనౌన్స్ చేసారు.

Devara Movie Second Song update

షూటింగ్ తుదిదశకు దేవర.. కానీ ప్రమోషన్లు?

ఇదిలా ఉండగా ఎన్టీఆర్ దేవర (Devara) సినిమా షూటింగ్ దాదాపు ఏడాదిన్నర కాలంగా తెరకెక్కుతుండగా, పక్కా ప్లానింగ్ తో మేకర్స్ షూట్ చేస్తున్నారు. ఇక ఇప్పటికే షూటింగ్ తుది దశకు చేరుకుందని సమాచారం. ఇక దేవరకి సంబంధించి కేవలం మరో వారం రోజుల షూటింగ్, అలాగే మరో రెండు పాటల షూట్ మాత్రమే బాకీ ఉందట. అంటే మరో మూడు వారాల్లో షూటింగ్ మొత్తం పూర్తవుతుందని టాక్ . కానీ మేకర్స్ నుండి మాత్రం గత నెలరోజులుగా ఎలాంటి అప్డేట్ రావడం లేదు. షూటింగ్ జరుగుతుందన్న మాటే గాని, ప్రమోషన్ అప్డేట్స్ రావడం లేదు. ఇప్పటివరకు, టీజర్, టైటిల్ సాంగ్ మినహా ప్రమోషన్ చేయలేదు. ముఖ్యంగా అభిమానులు రెండో సాంగ్ కోసం కాచుకుని ఉన్నారు.

- Advertisement -

రెండో సాంగ్ ఎప్పుడు?

ఇక దేవర చిత్రానికి సంబంధించి ప్రమోషన్లపై మేకర్స్ ఫోకస్ చేయడం లేదని అభిమానులు అసంతృప్తి చెందుతున్నారు. సినిమాని సెప్టెంబర్ 27న రిలీజ్ చేస్తున్నారు. అంటే రిలీజ్ కి రెండు నెలలు మాత్రమే సమయం ఉంది. మరి ఇప్పటినుండే ప్రమోషన్లు మొదలు పెట్టాలి. రెండో సాంగ్ ఈ నెల వస్తుందని చాలా రోజుల నుండి వార్తలు వస్తున్నా మేకర్స్ నుండి మాత్రం అప్డేట్ లేదు. రెండో సాంగ్ అప్పుడూ.. ఇప్పుడూ అంటూ మేకర్స్ తప్పించుకుంటున్నారని, ఫ్యాన్స్ మాత్రం ఎప్పుడూ అని నెట్టింట అడుగుతూనే ఉన్నారు. ఇటు సాంగ్ ఏదో రిలీజ్ చేసేస్తే, మేకర్స్ మళ్ళీ షూటింగ్ లో బిజీ అయిపోవచ్చన్నది నెటిజన్ల మాట. ఇక రెండో సాంగ్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ జాన్వికపూర్ మధ్య రొమాంటిక్ సాంగ్ అని టాక్. ఇక ఈ వీకెండ్ లో అప్డేట్ ఉంటుందని వార్తలు వస్తున్నాయి. మరి అనిరుద్ రాబోయే రొమాంటిక్ సాంగ్ కి ఎలాంటి ట్యూన్స్ సిద్ధం చేసాడో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు