Devara : డూప్ ను వెంటాడుతున్న అనుష్క సమస్య… దేవర ఛాన్స్ మిస్

Devara : ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న ఓ యంగ్ హీరోయిన్ ను అనుష్కకు ఉన్న సమస్య వెంటాడుతోందట. అసలు ఈ హీరోయిన్ తో అనుష్కకు సంబంధం ఏంటి అంటే ఓ సినిమాలో స్వీటీకి డూప్ గా నటించింది. అయితే ఇండస్ట్రీలో అనుష్క ఫేస్ చేసిన సమస్యనే ఆమెకు డూప్ గా నటించిన ఈ హీరోయిన్ కూడా ఫేస్ చేస్తోందని టాక్ నడుస్తుంది. పైగా ఆ సమస్య వల్ల ఎన్టీఆర్ పాన్ ఇండియా మూవీ దేవరలో నటించే అవకాశాన్ని కోల్పోయిందట. మరి ఆ హీరోయిన్ ఎవరు? అసలు సమస్య ఏంటి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

హీరోలకు హైట్ సమస్య…

ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న చాలామంది హీరోలు హైట్ తక్కువగా ఉండడంతో వాళ్లకు తగ్గ హీరోయిన్లను వెతకడంలో అష్ట కష్టాలు పడాల్సి వస్తోంది నిర్మాతలు. ప్రభాస్, మహేష్ బాబు వంటి స్టార్ హీరోలు మంచి హైట్ ఉంటారు. వీళ్ళకేమో వాళ్ళ హైట్ కు తగ్గ హీరోయిన్లను వెతకాలంటే కష్టం. ఇక మిగతా హీరోలంతా ఒక మాదిరిగా ఉన్నప్పటికీ అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్ కాస్త హైట్ తక్కువగా ఉంటారు. వీళ్ళ హైటుకు తగ్గ హీరోయిన్లు దొరకడం కూడా కష్టమే. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ హైట్ అనేది అతిపెద్ద సమస్యగా మారింది. ఈ హైట్ సమస్య కారణంగానే కన్నడ హీరోయిన్ రిషిక రాజ్ దేవర సినిమాలో నటించే ఛాన్స్ పోగొట్టుకుందట. అయితే హైట్ సమస్య ఆమెకి కాదు ఎన్టీఆర్ కి.

Rushika raj : ఏంటి.. బాహుబలిలో అనుష్క నటించలేదా.. ఆమె డూప్ నటించిందా

- Advertisement -

హైట్ సమస్యతో దేవర ఛాన్స్ మిస్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ ఇంకా షూటింగ్ దశలోనే ఉంది. అయితే అంతకంటే ముందే జరిగిన ప్రీ ప్రొడక్షన్ పనులకు మేకర్స్ చాలా టైం తీసుకున్నారు. అందులో సినిమాలో నటించే ప్రధాన నటీనటుల ఎంపిక కోసమే ఎక్కువ టైం స్పెండ్ చేశారట. ఇక కన్నడ బ్యూటీ రిషిక రాజ్ ను దేవర సినిమాలో పోలీస్ పాత్ర కోసం కన్ఫర్మ్ చేశామని చెప్పి మరీ టెస్ట్ లుక్ కూడా చేశారట. కానీ ఈమె హైట్ 5 అడుగుల 11 అంగుళాల ఎత్తు ఉండడం, ఎన్టీఆర్ 5 అడుగుల 6 అంగుళాలు ఉండడం సమస్యగా మారిందట. దీంతో హైట్ ఎక్కువైందనే కారణంతో రిషికా రాజ్ ను దేవర సినిమా నుంచి తప్పించారట.

ఎన్టీఆర్ అద్భుతమైన నటుడు అయినప్పటికీ ఆయన హైట్ అనేది అతి పెద్ద సమస్య అని అప్పట్లోనే సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు డైరెక్ట్ గా చెప్పారు. ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే ఎన్టీఆర్ కి కాకుండా ఆయనతో నటించే నటీనటులకే ఇది పెద్ద సమస్యగా మారినట్టుగా అనిపిస్తోంది. అయితే అనుష్క కూడా భారీ హైట్ ఉండడంతో ఆమెకు పలువురు స్టార్ హీరోల సరసన నటించే ఛాన్స్ రాలేదు. ఇదిలా ఉండగా రిషికా బాహుబలి సినిమాలో అనుష్కకి డూప్ గా నటించింది. అలాగే అశ్వి అనే సినిమాలో కూడా హీరోయిన్ గా చేసింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు