Devara : ఇంకా పాటే రాలేదు.. అప్పుడే ట్రోలింగా.. ఆ హీరోతో పోలుస్తూ?

Devara : టాలీవుడ్ లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ క్రేజీ చిత్రాల్లో ‘దేవర’ ఒకటి. కల్కి2898AD తర్వాత వస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా దేవర నే కావడంతో మూవీ లవర్స్ అందరి చూపు దీనిపైనే ఉంది. ఈ సినిమాని కూడా మొదట సమ్మర్ లోనే రిలీజ్ కి ప్లాన్ చేయగా, షూటింగ్ డిలే వల్ల దేవర సమ్మర్ నుండి ఏకంగా సెప్టెంబర్ కి వాయిదా పడిందని తెలిసిందే. ఇక ఈ సినిమా కోసం నందమూరి అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలో జనతా గ్యారేజ్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తుండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నందమూరి కళ్యాణ్ రామ్ ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తుండగా, దేవర మొదటి భాగం సెప్టెంబర్ 27న రిలీజ్ అవుతుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి మొదటి సాంగ్ వచ్చేయగా, చాలా రోజులకు రెండో సాంగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.

Devara Second Song poster Trolling On Social media

ఇంకా పాటే రాలేదు.. అప్పుడే ట్రోల్స్…

ఇదిలా ఉండగా ఎన్టీఆర్ దేవర (Devara) సినిమా షూటింగ్ దాదాపు తుది దశకు చేరుకోగా, ఇప్పుడిప్పుడే ప్రమోషన్లలో వేగం పెంచుతున్నారు. ఇదిలా ఉండగా ఈ సాంగ్ నుండి ఇప్పటివరకు ఫియర్ సాంగ్ రాగా, ఆ పాట మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇక లేటెస్ట్ గా రెండో సాంగ్ అప్డేట్ వచ్చేసింది. దేవర నుండి రెండో సాంగ్ ని ఆగష్టు 5న రిలీజ్ చేస్తున్నామని మేకర్స్ అనౌన్స్ చేసారు. ఇక ఈ రెండో సాంగ్ ఒక హీరోహీరోయిన్ల మధ్య ఒక రొమాంటిక్ సాంగ్ కాగా, ఎన్టీఆర్, జాన్వీ కపూర్ ఉన్న డాన్స్ మూమెంట్ లో ఉన్న ఒక క్రేజీ పోస్టర్ ని వదిలి అప్డేట్ ఇచ్చారు. అయితే ఇలా పోస్టర్ వచ్చిందో లేదో నెట్టింట ట్రోల్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. ఇంకా పాట కూడా రాలేదు కానీ సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది.

- Advertisement -

పోస్టర్ ని కంపేర్ చేస్తూ ట్రోలింగ్..

ఇక దేవర నుండి వచ్చిన సెకండ్ సాంగ్ అప్డేట్ కి సంబంధించిన పోస్టర్ నెట్టింట ట్రోల్ అవుతుంది. హీరోహీరోయిన్ డాన్స్ భంగిమ అంతగా సూట్ కాలేదని కొందరు మూవీ లవర్స్ అంటున్నారు. ముఖ్యంగా గత సినిమాల్లో కూడా ఇలాంటి ఫోజులతో పోస్టర్లు వచ్చాయి, వాటితో పోలిస్తే ఈ పోజు అంత బాగారాలేదని అంటున్నారు నెటిజన్లు. ఇక ప్రభాస్, రామ్ చరణ్ ఫ్యాన్స్ తమ హీరోలు నటించిన మగధీర, రాధే శ్యామ్ పోస్టర్లను డైరెక్టర్ కాపీ కొట్టాడని, వాటితో పోలిస్తే ఈ పోస్టర్ ఏమి బాగాలేదని ట్రోల్ చేస్తున్నారు. ఇక ఇదిలా ఉండగా ఈ సాంగ్ పోస్టర్ లో ఎన్టీఆర్ కాలు కూడా కనిపించట్లేదని కెమెరామెన్ ఎవడ్రా అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఏది ఏమైనా ఇలాంటి ట్రోల్స్ సహజమే అని, సాంగ్ వచ్చాక అంతా సెట్ అవుతుందని కొందరు నెటిజన్లు అంటున్నారు. మరి దేవర, తంగం మధ్య రొమాంటిక్ సాంగ్ ని దర్శకుడు కొరటాల శివ ఎలా డిజైన్ చేసాడో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు