Tamil Hero : రెండో పెళ్లికి రెడీ అవుతున్న తమిళ్ హీరో.. అమ్మాయి ఎవరంటే?

Tamil Hero : తమిళ స్టార్ హీరో ధనుష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తమిళ్లో ఈయన చేసిన సినిమాలు తెలుగులో కూడా డబ్ అవ్వడం చూస్తూనే ఉన్నాం. అందుకే ఇక్కడ కూడా ఆయనకు మంచి మార్కెట్ ఉంది. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇటీవల రిలీజ్ అయిన సినిమాలు అన్ని బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను అందుకున్నాయి. రీసెంట్ రాయన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. రీసెంట్ ఓటీటీలోకి రాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తాజాగా ఈయన రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఆ అమ్మాయి ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

హీరో ధనుష్, రజినీ కాంత్ కూతురు ఐశ్వర్య రాజేష్ ను పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత మనస్పర్థలు రావడంతో ఈ మధ్యే విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే.. అయితే ఇద్దరు వేరు వేరుగా కొత్త ఇల్లు కొనుక్కొని గృహప్రవేశం చేశారు. ఇకపోతే ధనుష్ ఇప్పుడు రెండో పెళ్లి చేసుకోబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ధనుష్ దగ్గర బంధువు ఒక అమ్మాయితో పెళ్లి ఫిక్స్ అయ్యినట్లు వార్త వినిపిస్తుంది.. అందులో నిజమేంత ఉందో తెలియదు కానీ ఈ వార్త మాత్రం ఓ రేంజులో వైరల్ అవుతుంది. ఇక పోతే దీనిపై ధనుష్ క్లారిటీ ఇస్తే తప్ప అసలు నిజమేంటో తెలియదు..

Dhanush is getting ready for his second marriage, who is the girl?
Dhanush is getting ready for his second marriage, who is the girl?

ఇక సినిమాల విషయానికొస్తే.. 50వ చిత్రం ‘రాయన్’. తన 50వ చిత్రానికి తానే స్వయంగా డైరెక్టర్‌గా మారాడు ధనుష్. దాదాపు రూ.70 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ‘రాయన్’ మూవీ, బాక్సాఫీస్ దగ్గర రూ.150 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, ధనుష్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. నెల కూడా తిరక్కుండానే ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది ‘రాయన్’ మూవీ.. ఈ మూవీని ఆగస్టు 23న ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికీ ‘రాయన్’ మూవీకి తమిళ్‌లో మంచి వసూళ్లు వస్తున్నాయి. ఇక నాగార్జునతో కలిసి కుబేర సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా త్వరలోనే విడుదల కాబోతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు