Kubera : ఆ సినిమా వాయిదా పడితే అదే డేట్ కి కుబేర ప్లాన్?

Kubera : టాలీవుడ్ లో 2024 ఫస్ట్ హాఫ్ లో పెద్ద సినిమాలు అంతగా రిలీజ్ కాలేదని తెలిసిందే. గుంటూరు కారం మినహా అన్ని సినిమాలు మీడియం రేంజ్, చిన్న సినిమాలే కాగా, ఎన్నో సినిమాలు సమ్మర్ నుండి తొలగి వాయిదా పడుతూ వస్తున్నాయి. కాగా సెకండ్ హాఫ్ లో వాయిదా పడ్డ సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. అయితే ఈ సీజన్లో బడా చిత్రాలు ఎక్కువ కావడంతో సరైన రిలీజ్ డేట్ కూడా దొరక్క ఇబ్బంది పడుతున్నాయి. ముఖ్యంగా పాన్ ఇండియా సినిమాలకు రిలీజ్ డేట్ ఇబ్బందులు చాలా ఉన్నాయి. ఇక ఈ ఇయర్ రాబోతున్న పాన్ ఇండియా సినిమాల్లో కొన్ని సినిమాల షూటింగ్ లు పూర్తయిపోయినా, రిలీజ్ కి మాత్రం ఇబ్బందులు ఎదురవుతున్నాయనే చెప్పాలి. అలాంటి క్రేజీ సినిమాల్లో “కుబేర” కూడా ఒకటి. అయితే తాజాగా కుబేర సినిమా రిలీజ్ కి సంబంధించి మరో వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది.

Dhanush Kubera for Pushpa 2 release date

ఆ సినిమా వాయిదా పడితే ఆ డేట్ కి కుబేర…

ఇక కుబేర (Kubera) సినిమాలో ధనుష్, నాగార్జున నటించగా, ఈ సినిమాను శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. చాలా రోజులుగా ఈ సినిమా వాయిదా పడుతుండగా తాజాగా ఈ సినిమాని ఓ పెద్ద సినిమా డేట్ కి తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఆ బడా సినిమాయే ‘పుష్ప ది రూల్’.. అవును.. అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో రాబోతున్న పుష్ప 2 ని డిసెంబర్ 6న రిలీజ్ చేయబోతున్నారని తెలిసిందే. అయితే ఈ సినిమాకి సంబంధించి ఇంకా నెలరోజుల షూటింగ్ బాకీ ఉందని, ఎక్కువ శాతం డిసెంబర్ నుండి కూడా తొలగిపోయే ఛాన్స్ ఉందని వార్తలు వస్తున్నాయి. అయితే ఒకవేళ పుష్ప2 గనుక వాయిదా పడితే ఆ డేట్ కి అనగా డిసెంబర్ 6కి కుబేర సినిమాని రిలీజ్ చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట. అందుకే ఇప్పటివరకు కుబేర రిలీజ్ డేట్ ని కూడా ప్రకటించలేదు.

- Advertisement -

అన్ని పనులు పూర్తి చేసుకున్న కుబేర..

ఇక కుబేర సినిమాకి సంబంధించి షూటింగ్ ఇప్పటికే పూర్తయిపోగా, ధనుష్, నాగార్జున వారి పాత్రలకు డబ్బింగ్ కూడా పూర్తి చేసారని సమాచారం. ఇక ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటించిన ధనుష్, నాగార్జున, రష్మిక మందన్న మిగతా సినిమాల్లో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం కుబేర పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉండగా, రిలీజ్ డేట్ పై క్లారిటీ రాగానే ప్రమోషన్లు మొదలుపెడతారట. ఇక కుబేర నుండి హీరోల టీజర్లు రాగా, త్వరలో పాటలు కూడా విడుదల కానున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు