Samantha: బజార్’కెక్కినందుకు సామ్ అంత డిమాండ్ చేసిందా?

సినిమాల నుంచి కాస్త విరామం తీసుకున్న సౌత్ స్టార్ హీరోయిన్ సమంతా రూత్ ప్రభు తాజాగా సమంత “బజార్” అనే ఓ మ్యాగజైన్ కోసం ఫోటో షూట్ చేయగా, అవి సోషల్ మీడియాను షేక్ చేశాయి. ఈ ఫోటోషూట్ కు సంబంధించిన ఫోటోలను సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. సమంత బ్లాక్ డిజైనర్ దుస్తుల్లో సూపర్ హాట్ గా కనిపించింది. బికినీ లాంటి డ్రెస్ లో హాట్ క్లీవేజ్ షోతో టెంపరేచర్ పెంచేసింది. ఆమె హాట్ అవతార్ సోషల్ మీడియాను షేక్ చేసింది. సామ్ ఒళ్ళు దాచుకోకుండా చేసిన ఎక్స్పోజ్ కుర్రాళ్లలో సెగలు పుట్టిస్తుంటే, ఆమె అభిమానుల్లో కొంతమంది మాత్రం ఈ విషయంపై సీరియస్ అవుతున్నారు. ఇదిలా ఉంటే ఆమె ఈ ఫోటోషూట్ కోసం ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంది అనే విషయంపై ఇప్పుడు చర్చ నడుస్తోంది.

సమంత చాలా బోల్డ్‌గా కనిపించడంతో ఈ ఫోటోషూట్ కోసం భారీగానే వసూలు చేసిందని అంటున్నారు. సమంత ధరించిన ఈ డ్రెస్ లూయిస్ విట్టన్ బ్రాండ్ కు చెందినదిగా తెలుస్తోంది. ఈ డిజైనర్ వేర్ ధర అక్షరాలా రూ. 5.5 లక్షలు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే.. సమంత ప్రమోషన్స్ లో భాగంగా తన ఇన్స్టా లో ఒక్క పోస్ట్‌ చేయడానికి 15 లక్షల నుంచి 20 లక్షలు తీసుకుంటుందట. ఇన్‌స్టాగ్రామ్‌లో సామ్ కు 30 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. మరి ఈ రేంజ్ ఫాలోవర్లు ఉన్నప్పుడు ఆ రేంజ్ లో వసూలు చేయడం సాధారణ విషయమే. అయితే ‘బజార్’ ఫోటోషూట్ కు సంబంధించి సామ్ 4-5 పోస్ట్‌లు ఇప్పటికే పోస్ట్ చేసిందని ఆమె ఇన్స్టా అకౌంట్ చూస్తే తెలుస్తోంది. మరి ఒక్కో పోస్ట్ కు 20 లక్షలు అంటే సామ్ ఈ ఒక్క ఫోటోషూట్ తోనే కోటి రూపాయల ఆదాయం సంపాదించినట్టే.

ఇది తెలుసుకున్న నెటిజన్లు రీసెంట్ గా చేసిన ఓ ఫోటో షూట్ లో బేర్ బ్యాక్ ఫోటోకి 15 లక్షలు ఛార్జ్ చేశారా ? అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక సమంత గత కొన్ని రోజులుగా మయోసైటిస్‌తో బాధపడుతోందన్న విషయం తెలిసిందే. దీంతో ఇప్పుడు ఆమె తన సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. మయోసైటిస్‌ తగ్గడానికి ఆమె ఆయుర్వేద చికిత్స తీసుకుంటున్నట్లు సమాచారం.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు