RAPO: ఈ సినిమాలో కూడా లాజిక్ వదిలేసావా బోయపాటి..?

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, డైరెక్టర్ బోయపాటి కాంబినేషన్లో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇంకా టైటిల్ అనౌన్స్ చేయని ఈ సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసింది సినిమా యూనిట్. ఈ సినిమాను సెప్టెంబర్ 23న తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేయనున్నట్టు అనౌన్స్ చేసింది. ఈ మేరకు రిలీజ్ చేసిన పోస్టర్లో హీరో రామ్ పంచకట్టులో చేతిలో కాఫీ కప్పుతో మోడరన్ రైతు లుక్ లో అలరిస్తున్నాడు.

ఇంతకుముందు రిలీజ్ చేసిన గ్లింప్స్ కి, ఈ పోస్టర్ కి చాలా వత్యాసం ఉండటంతో సినిమాపై ఆసక్తి పెరుగుతోంది. ఇక్కడి వరకూ బాగానే ఉన్నా, పోస్టర్ బ్యాక్ గ్రౌండ్ కొంచెం భిన్నంగా కనిపిస్తుండటంతో నెటిజన్లు రంధ్రాన్వేషణ మొదలు పెట్టారు. అదేంటంటే, ఎత్తుగా పండిన వరి చేల వద్ద నులక మంచం మీద హీరో రామ్ కూర్చొని ఉండగా బ్యాక్ గ్రౌండ్ లో రైతులు వరి చేలలోకి ఎడ్లను దింపటం పట్ల నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

ఇప్పటిదాకా బోయపాటి ఫైట్స్ లోనే లాజిక్ ఉండదు అనుకుంటే, ఇప్పుడు సీన్స్ లో కూడా లాజిక్ మిస్ అవుతున్నదని కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు. ఇదే పోస్టర్ ని గనక పొలాల బ్యాక్గ్రౌండ్ లో కాకుండా వేరే ఎక్కడైనా ప్లాన్ చేసి ఉంటే రిచ్ లుక్ వచ్చేదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. రామ్ సరసన శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. అయితే, మొదట్లో అక్టోబర్లో రిలీజ్ చేయాలని అనుకున్న ఈ సినిమాను సెప్టెంబర్ కి ప్రీపోన్ చేయటంతో దసరా కాంపిటీషన్ నుండి తప్పుకున్నట్లు అయ్యింది.

- Advertisement -

ఇది ఒక రకంగా రామ్ క్లి కలిసొచ్చే అంశమని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే దసరా సీజన్ కి మాస్ మహారాజ రవితేజ, బాలకృష్ణల సినిమాలు డేట్ ఫిక్స్ చేసుకోగా అదే డేట్ కి రామ్ సినిమా రిలీజ్ అయినట్లయితే థియేటర్ల సమస్య వచ్చేది. మరి, కాంపిటీషన్ నుండి ముందు జాగ్రత్తతో తప్పుకున్న రామ్ ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకుంటాడా లేదా చూడాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు