Game Changer: చెప్పినట్టే చెప్పి మళ్ళీ ఎస్కేప్ అవుతున్నాడు..!

Game Changer: టాలీవుడ్ లో ప్రస్తుతం అందరికంటే డల్ గా ఉన్నది చెర్రీ ఫ్యాన్సే.. ఎందుకంటే RRR తరువాత రామ్ చరణ్ ఫ్యాన్స్ కి ఇప్పటివరకు కిక్కిచ్చే అప్డేట్ ఒక్కటీ రాలేదు. చరణ్ ఫ్యాన్స్ తో పాటు కామన్ ఆడియన్స్ అందరి చూపు ఇప్పుడు గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ పైనే ఉంది. మూడేళ్ళుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఇండియన్2 వల్ల రిలీజ్ డేట్ ఆలస్యం అవుతూ వస్తుంది. అటు రామ్ చరణ్ ఫ్యామిలీ వేడుకల్లో బిజీ గా ఉంటే, శంకర్ ఇండియన్ 2 షూట్ లో బిజీ గా ఉన్నాడు. ఎటొచ్చి నిర్మాత దిల్ రాజు మాత్రం తనకే సంబంధం లేనట్టు, అసలేమీ పట్టనట్టు తిరుగుతున్నాడు.

ఇదిలా ఉండగా మొన్నామధ్య సలార్ ప్రీమియర్స్ కి వచ్చిన దిల్ రాజును గేమ్ ఛేంజర్ అడగ్గా, సెప్టెంబర్ రిలీజ్ అని చెప్పి ఒక్కమాటతో ముగించాడు. ఈ అప్డేట్ తో మెగా ఫ్యాన్స్ లేట్ అయినా ఓ క్లారిటీ ఇచ్చాడంటూ ఆ వీడియో ను షేర్ల మీద షేర్లు చేసారు.

అయితే తాజాగా దిల్ రాజు సంక్రాంతి మూవీస్ రిలీజ్ డేట్లపై ప్రెస్ మీట్ పెట్టగా, అక్కడా మళ్ళీ గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ పై విలేఖరులు ప్రశ్నించారు. అయితే మొన్నే సెప్టెంబర్ రిలీజ్ అని దిల్ రాజు అనగా, నిన్న జరిగిన ప్రెస్ మీట్ లో మాత్రం అసలేవిషయం చెప్పకుండా టాపిక్ డైవర్ట్ చేసాడు. అసలు టాపిక్ ఎక్కడ్నుంచి ఎక్కడికో వెళ్లిపోతుందంటూ ఎస్కేప్ అయ్యాడు.

- Advertisement -

అయినా సరే దిల్ రాజు ను మెగా ఫ్యాన్స్.. గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ పై సోషల్ మీడియా సహా, ఎక్కడా వదలకుండా అడుగుతూనే ఉన్నారు. ఇక యాంటీ ఫ్యాన్స్ ట్రోలింగ్ గురించి పెద్దగా చెప్పనక్కర్లేదు. మరి వీళ్లందరి నోళ్లు మూత పడేయడానికి గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ పై పక్కా క్లారిటీ ఇచ్చేస్తే ఓ పనైపోతుందని ట్రేడ్ విశ్లేషకులు కూడా కామెంట్స్ చేస్తున్నారు.

check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు