Premalu Heroine : స్టార్ డైరెక్టర్ పై ప్రేమలు హీరోయిన్ ఆరోపణలు… కొట్టాడంటూ…

ప్రస్తుతం మూవీ లవర్స్ ను ఊపేస్తున్న “ప్రేమలు” హీరోయిన్ మమితా బైజు స్టార్ డైరెక్టర్ బాలా గురించి షాకింగ్ కామెంట్స్ చేసి వార్తల్లోకి ఎక్కింది. ఏకంగా అతను సెట్స్ లో తనను కొట్టాడని ఆమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో డైరెక్టర్ బాలా సెట్స్ లో తనను తిట్టేవాడని, కొట్టాడని చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది. ఇంతకీ మమితా బైజు డైరెక్టర్ బాలాపై ఎందుకు ఇలాంటి కామెంట్స్ చేసింది? అసలు కథ ఏంటి? అనే వివరాల్లోకి వెళ్తే…

“ప్రేమలు” ఫీవర్
మలయాళంలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన “ప్రేమలు” మూవీకి వస్తున్న క్రేజ్ సినీ విశ్లేషకులను ఆశ్చర్యపరుస్తోంది. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు “ప్రేమలు” పాటలు, ఫోటోలు, సీన్లు ఇవే కనిపిస్తున్నాయి. ఆ రేంజ్ లో ఒక చిన్న సినిమాకి ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు అంటేనే అందులో ఉన్న కంటెంట్ ఎంత స్ట్రాంగ్ అనేది అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్ బ్యాక్ గ్రౌండ్ లో నడిచే ఈ యూత్ ఫుల్ మలయాళ మూవీ కేరళలో సంచలనం సృష్టిస్తోంది. ఈ మూవీని రాజమౌళి తనయుడు కార్తికేయ మార్చి 8న తెలుగులో రిలీజ్ చేయబోతున్నారు. ఇక ఇందులో హీరోయిన్ గా నటించిన మమితా బైజు రాత్రికి రాత్రే ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. సినిమాలో చాలా క్యాజువల్ గా, సింపుల్ లుక్ లో కనిపించిన ఈ కేరళ బ్యూటీకి అందరూ ఫిదా అయిపోయారు. దీంతో ఈ అమ్మడిని వరుసగా స్టార్ల సరసన నటించే అవకాశాలు వరిస్తుండడం విశేషం. అందులో భాగంగానే తాజాగా సూర్య పక్కన హీరోయిన్ గా నటించే ఛాన్స్ రాగా, మమితా వదులుకుంది. దానికి కారణం డైరెక్టర్ బాలా అంటూ తాజాగా సంచలన కామెంట్స్ చేసింది.

డైరెక్టర్ బాలా చేయి చేసుకున్నాడంటూ…
స్టార్ డైరెక్టర్ బాల దర్శకత్వంలో సూర్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ “వనంగాన్”. “ప్రేమలు” మూవీతో పాపులర్ అయిన మమితా బైజుకి ఈ సినిమాలో ఫిమేల్ లీడ్ గా నటించే అవకాశం దక్కింది. అయితే ఇంత పెద్ద ప్రాజెక్ట్ నుంచి ఈ అమ్మడు తప్పుకోవడం చర్చకు తీసింది. తాజాగా తాను “వనంగాన్” నుంచి ఎందుకు తప్పుకోవలసి వచ్చింది అనే విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో మమత స్వయంగా వెల్లడించింది. ఆమె చెప్పిన దాని ప్రకారం సినిమాలో విల్లాధిచంపాడు అనే ఒక వాయిద్యం ఉందని, అయితే దాన్ని చూసాక తన పాత్ర చాలా కాలంగా ఆ వాయిద్యాన్ని వాయిస్తోందా లేక అదే తొలిసారి అని డైరెక్టర్ని ప్రశ్నించిందట ఈ అమ్మడు. తన పాత్రకు ఈ సినిమాలో చాలా అనుభవం ఉందని చెప్పిన డైరెక్టర్, దాన్ని వాయించే ఒక మహిళను చూపించి, చూసి నేర్చుకోమన్నాడట. కానీ అది నేర్చుకోవడానికి ఎక్కువగా సమయం ఇవ్వకుండా వెంటనే షూటింగ్ చేయాలని చెప్పాడని చెప్పుకొచ్చింది మమితా.

- Advertisement -

ఇక్కడే వివాదం స్టార్ట్…
దీంతో మమితకు అసలేం చేయాలో అర్థం కాలేదట. మూడుసార్లు ట్రై చేస్తేనే గానీ ఆ వాయిద్యాన్ని ఎలా వాయించాలి అనే విషయం తనకు తెలియ రాలేదని వివరించింది “ప్రేమలు” భామ. అయితే అంతలోపే డైరెక్టర్ బాలా తనను చాలా సార్లు తిట్టాడని, కొట్టాడని షాకింగ్ కామెంట్స్ చేసింది. కానీ ఈ విషయాన్ని ఆయన ముందుగానే తనతో చెప్పాడని, దానికి తగినట్లుగానే తను సిద్ధమయ్యాననే విషయాన్ని మమత బయటపెట్టింది. పక్కనే సూర్య ఉన్నప్పటికీ ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదని, బాలాతో ఎలా ఉంటుందో ఆయనకు ముందే తెలుసు అని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా వాళ్లు అంతకుముందే కలిసి పని చేశారని, దీనికి తానే కొత్తదాన్ని అని, అందుకే ఆ ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చాను అని ఓ యూట్యూబ్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మమితా వెల్లడించింది.

Checkout Filmify for the latest Movie news in Telugu, New Movie Reviews & Ratings, and all the Entertainment News. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other film industries Movies updates, etc

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు