Vaishnav Tej: డిజాస్టర్ హీరో – డిజాస్టర్ డైరెక్టర్ హిట్ కొడతారా..?

మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ ఉప్పెన సినిమా తర్వాత సరైన హిట్ లేక సతమతం అవుతున్నాడు. ప్రస్తుతం వైష్ణవ్ నటిస్తున్న ఆదికేశవ సినిమా గ్లిమ్ప్స్ ఇటీవలే విడుదలైంది. రొటీన్ యాక్షన్ డ్రామా ఫీల్ ఇచ్చిన ఆ గ్లిమ్ప్స్ సినిమాపై ఏ మాత్రం హైప్ క్రియేట్ చేయలేకపోయింది. ఇదిలా ఉండగా రీసెంట్ గా ఏజెంట్ సినిమాతో డిజాస్టర్ అందుకున్న దర్శకుడు సురేందర్ రెడ్డి డైరెక్షన్లో వైష్ణవ్ తేజ్ సినిమా చేయనున్నాడని వార్తలొస్తున్నాయి.సురేందర్ రెడ్డి కథ మాత్రమే అందించనున్నాడని కూడా టాక్ వినిపిస్తోంది. ఈ వార్తల్లో నిజమెంతో తెలీదు కానీ, తాను డైరెక్ట్ చేసే సినిమాలకే కథ కోసం వక్కంతం వంశీ లాంటి వారి మీద డిపెండ్ అయ్యే దర్శకుడు వైష్ణవ్ కోసం కథ సిద్ధం చేస్తాడా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

సురేందర్ రెడ్డి కెరీర్లో అతనొక్కడే, కిక్ మినహా చెప్పుకోదగ్గ హిట్ లేనప్పటికీ ఊసరవెల్లి లాంటి సినిమాల్లో యాక్షన్ సీక్వెన్స్ లకి కామెడీకి మంచి అప్లాజ్ వచ్చింది. అయితే, ఇటీవల వచ్చిన ఏజెంట్ డిజాస్టర్ అవ్వటంతో సురేందర్ రెడ్డికి నెగిటివిటీ పెరిగింది. అంతటి డిజాస్టర్ తర్వాత ఎక్కువ గ్యాప్ లేకుండా అవకాశాలు వస్తుండటం సురేందర్ రెడ్డి అదృష్టం అని చెప్పాలి. అన్ని అనుకున్నట్టు జరిగితే, ఈ కాంబినేషన్లో సినిమాపై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తుందని టాక్ వినిపిస్తోంది.

ఉప్పెన సినిమా ద్వారా మొదటి సినిమాతోనే 100కోట్ల క్లబ్ లో చేరిన వైష్ణవ్, ఆ తర్వాత వచ్చిన కొండపోలం, రంగ రంగ వైభవంగా సినిమాలతో వరుస ఫ్లాప్స్ అందుకున్న నేపథ్యంలో ప్రస్తుతం హిట్ తప్పనిసరి అన్న పరిస్థితి నెలకొంది. ఇప్పుడు వినిపిస్తున్న టాక్ నిజమే అయితే వైష్ణవ్ కోసం సురేందర్ రెడ్డి వైష్ణవ్ కోసం ఎలాంటి కథగా సిద్ధం చేయనున్నాడు, ఈ సినిమాతో అయినా ఇద్దరి డిజాస్టర్ల పరంపరకి బ్రేక్ పడుతుందా లేదా వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు