Ram Charan : గేమ్ ఛేంజర్ తమిళ్ హక్కుల కోసం భారీ పోటీ?

టాలీవుడ్ లో తెరకెక్కుతున్న మోస్ అవైటెడ్ ప్రాజెక్టుల్లో “గేమ్ ఛేంజర్” ఒకటి. రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాను శంకర్ షణ్ముగం దర్శకత్వం వహిస్తున్నాడన్న విషయం తెలిసిందే. దిల్ రాజు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా గత మూడేళ్ళుగా తెరకెక్కుతుందన్న విషయం తెలిసిందే. మామూలుగా శంకర్ సినిమా తెరకెక్కిస్తే ఎంత టైం తీసుకుంటాడో తెలిసిందే. రాజమౌళి పర్ఫెక్షన్ కోసం ఎంత ట్రై తీసుకుంటాడో, శంకర్ అంతకన్నా ఎక్కువ టైం తీసుకుంటాడు. అయితే గేమ్ ఛేంజర్ విషయంలో చాలా ఆలస్యం జరుగుతుందన్న మాట వాస్తవం.

పైగా ఈ సినిమా నుండి ఇప్పటివరకు ఒక్క ఫస్ట్ లుక్ పోస్టర్ మినహా ఏ అప్డేట్ కూడా రాలేదు. ఆ మధ్య సాంగ్ రిలీజ్ చేస్తామని ప్రకటించినా కొన్ని కారణాల వల్ల వాయిదా వేశారు. అయితే రామ్ చరణ్ బర్త్ డే సందర్బంగా గ్రాండ్ గా టీజర్ చేద్దామని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. ఇదిలా ఉండగా గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ బిజినెస్ పై మాత్రం ఇప్పట్నుంచే రచ్చ జరుగుతుంది. మొన్నటి వరకు గేమ్ ఛేంజర్ ఓవర్సీస్ బిజినెస్ పై పలు రకాల వార్తలు వచ్చాయి. గేమ్ ఛేంజర్ ఓవర్సీస్ బిజినెస్ దాదాపు 36 కోట్ల వరకు జరిగిందని టాక్ వచ్చింది. ఇప్పుడు తమిళ్ హక్కులపై టాపిక్ వైరల్ గా మారింది.

తాజాగా గేమ్ ఛేంజర్ తమిళ్ వెర్షన్ రైట్స్ కోసం దిల్ రాజుతో తమిళ్ బయ్యర్లు మీటింగ్ కోసం ప్రయత్నిస్తున్నారని తమిళ్ హక్కుల్ని భారీ మొత్తంలో చెల్లించి దక్కించుకునేందుకు అక్కడి డిస్ట్రిబ్యూటర్లు ప్రయత్నిస్తున్నారని తెలిసింది. ఇక గేమ్ ఛేంజర్ తమిళనాడులో 50 కొట్లాస్ వరకు రేటు పలుకుతుందని టాక్. దీనికి కారణం డైరెక్టర్ శంకరే. శంకర్ సినిమా పనితనం వాళ్లకి తెలుసు కాబట్టి ఆ నమ్మకంతో టీజర్ కూడా రాకుండానే ఎంతైనా చెల్లించడానికి అక్కడి బయ్యర్లు సిద్ధంగా ఉన్నారని టాక్. అయితే దిల్ రాజు మాత్రం టీజర్ రిలీజ్ అయ్యాక అంచనాలు మారుతాయి కాబట్టి అప్పుడు ప్లాన్ చేద్దామని చూస్తున్నట్టు తెలుస్తుంది.

- Advertisement -

check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు