Divi : టాలీవుడ్ లో బిగ్ బాస్ షో ద్వారా ఎంతో మంది ముద్దుగుమ్మలు పాపులర్ అయ్యారన్న సంగతి తెలిసిందే. సీరియల్ హీరోయిన్స్, జూనియర్ ఆర్టిస్ట్స్, యూట్యూబ్ స్టార్స్ ఇలా అన్ని రకాల వాళ్ళు బిగ్ బాస్ కి వచ్చి తమ ప్రతిభ చాటుకున్నారు. ఇక అలా తెలుగు బిగ్ బాస్ ద్వారా పాపులారిటీని సొంతం చేసుకున్న ముద్దుగుమ్మల్లో “దివి” ఒకరు. బిగ్ బాస్ 4 ద్వారా ఈమె పాపులర్ అయింది. అయితే అంతకు ముందే పలు సినిమాల్లో నటించినా కూడా ఏ ఒక్కటి ఈమెకు ఆశించిన స్థాయిలో గుర్తింపు తెచ్చి పెట్టలేక పోయాయి. కానీ బిగ్ బాస్ లో ఎప్పుడైతే ఈ అమ్మడు కనిపించిందో అప్పటి నుంచి కూడా సోషల్ మీడియాలో ఈ అమ్మడి పేరు మారుమోగుతూనే ఉంది. ఇక ఈ షో కి వచ్చిన మెగాస్టార్ చిరంజీవి తన సినిమాలో మంచి వేషం ఇస్తానన్నారు. అన్నట్టుగానే గాడ్ ఫాదర్ సినిమాలో కీలక పాత్ర ఛాన్స్ ఇవ్వడం జరిగింది. ఇక ఈ మధ్యనే లంబసింగి అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది దివి.
పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది..
ఇక సినిమాలు తక్కువగా చేస్తున్నా సోషల్ మీడియా లో మాత్రం ఈ అమ్మడు బాగా యాక్టీవ్ గా ఉంటుంది. దివి పాప అంటూ నెటిజన్లు ముద్దుగా పిలుచుకునే ఈమె షేర్ చేసిన ప్రతి ఫోటో ని లైక్ చేసి షేర్ చేస్తూ ఉంటారు. ఆకట్టుకునే అందం తో పాటు మంచి ఫిజిక్ ఈ అమ్మడి సొంతం. సినిమాల్లో గ్లామర్ షో చేస్తుందా అన్న విషయం పక్కన పెడితే రెగ్యులర్ గా దివి సోషల్ మీడియాలో తన అందాల ఆరబోత ఫోటోలు షేర్ చేయడం మనం చూస్తూనే ఉంటాం. ఈ అమ్మడి యొక్క వీడియోలు కూడా వైరల్ అవ్వడం మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఓ ఓల్డ్ వీడియో తో దివి నెట్టింట వైరల్ అయ్యింది. దాదాపు అయిదు సంవత్సరాల క్రితం వీడియో అంటూ ఈ వీడియోను దివి షేర్ చేసింది. గోవా బీచ్ లో ‘దోబూచులాట’ అనే ప్రాజెక్ట్ షూటింగ్ కు వెళ్లిన సమయంలో తీసిన వీడియో అంటూ దివి ఈ వీడియోను షేర్ చేసింది. ఐ లవ్ సారీస్, ఐ లవ్ ట్రెడీషనల్ వేర్ అంటూ తన పథ జ్ఞాపకాలను దివి షేర్ చేసుకుంది.
ఫోటోషూట్లతో రచ్చ..
అయితే దివి (Divi) సినిమాలతో ఎక్కువగా బిజీ గా లేకపోయినా, తన ఫోటోషూట్లతో ఎప్పటికప్పుడు సోషల్ మీడియా లో సందడి చేస్తుంది. తాజాగా పెట్టిన వీడియో లో దివి ప్రస్తుతం తో పోల్చితే సన్నగా నాజూకుగా కనిపిస్తుంది. నడుము అందం చూపిస్తూ కవ్విస్తుంది. అంతే కాకుండా చీర కట్టు లో సరికొత్తగా కనిపిస్తుందని, బ్లాక్ బ్లౌజ్ తో చూపరుల దృష్టిని ఆకర్షిస్తుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక అంతకు ముందు కూడా చీరల్లో సైతం సెగలు పుట్టించేలా అందాలారబోసింది. స్టార్ హీరోయిన్లకు ఏమాత్రం తక్కువ కాదు అంటూ ఆ ఫోటోషూట్లు చేసింది. ఇక ఈ రేంజ్ లో అందాల ఆరబోత చేస్తున్న దివికి దక్కాల్సిన ఆఫర్లు దక్కడం లేదు అనేది చాలా మంది అభిప్రాయం. ప్రస్తుతం ఏ రెండు చిన్న సినిమాల్లో నటిస్తున్న దివి, స్టార్స్ సినిమాల్లో ఇంపార్టెంట్ కీ రోల్స్ వచ్చినా చేస్తానంటుంది.