Divorce : పెళ్లయిన 10 నెలలకే స్టార్ కపుల్ విడాకులు… ఆ పోస్ట్ అందుకేనా?

Divorce : ఇటీవల కాలంలో చాలామంది సెలబ్రిటీ కపుల్స్ విడాకులు తీసుకోబోతున్నాం అని ప్రకటిస్తూ తమ ఫ్యాన్స్ కు షాక్ ఇస్తున్న విషయం తెలిసిందే. ఎప్పటి నుంచో హింట్స్ ఇస్తూ వచ్చిన నటాష, హార్దిక్ పాండ్య ఎట్టకేలకు విడిపోయారు. ఇక ఇప్పుడు ఐశ్వర్య రాయ్, అభిషేక్ కూడా డివోర్స్ కు రెడీ అవుతున్నారు అంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా మరో స్టార్ హీరోయిన్ కూడా ఇలాంటి అనుమానమే వచ్చే పోస్ట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.

హీరోయిన్ క్రిప్టిక్ పోస్ట్‌

బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. కానీ తాజాగా పరిణీతి సోషల్ మీడియాలో ఓ క్రిప్టిక్ పోస్ట్‌ను పంచుకోవడం హాట్ టాపిక్ గా మారింది. ఆ పోస్ట్ ను  చూసిన తర్వాత ఆమె వైవాహిక జీవితంలో సమస్యలు మొదలయ్యాయి అని అభిమానులు అంచనా వేస్తున్నారు. గతేడాది సెప్టెంబర్ 24న పరిణీతి ఆప్ ఎంపీ రాఘవ్ చద్దాను వివాహం చేసుకున్నారు. పెళ్లయిన 10 నెలల తర్వాత పరిణీతి చోప్రా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఆ వీడియోలో బోట్‌లో కూర్చున్న పరిణీతి ముఖంలో అసహనం కనిపిస్తోంది. నో మేకప్ లుక్‌లో ఉన్న ఆమె సుదీర్ఘ పోస్ట్ ను రాసింది. అందులో ఆమె తన భావోద్వేగాలను వ్యక్తపరిచినట్టుగా కన్పిస్తోంది.

विषारी लोकांना आयुष्यातून बाहेर हकला, आणि..., लग्नाच्या 10 महिन्यांनंतर परिणीतीची वादग्रस्त पोस्ट

- Advertisement -

ఈ పోస్ట్ లో పరిణీతి ‘ఈ నెలలో నేను ఆగి కాసేపు ఆలోచించాను. మళ్లీ నమ్మాను అంటే మనస్తత్వమే సర్వస్వం. అప్రధానమైన విషయాలకు జనాలు ప్రాముఖ్యత ఇవ్వడం మానేయండి. మీ జీవితంలో ఒక్క సెకను కూడా వృధా చేసుకోకండి. జీవితం ఒక టిక్కింగ్ గడియారం. ప్రతిసారీ మీ స్వంత భావాలకు విలువ ఇవ్వండి… దయచేసి ఇతరుల కోసం జీవించడం మానేయండి. మీరు ఇతరుల అభిప్రాయానికి భయపడినప్పుడు, మీరు మీ స్వంత జీవితాన్ని గడపడం మానేస్తారు. మీ చివరి రోజున అంతకన్నా ఎక్కువ బాధపెట్టే విషయం ఏది ఉండదు. మీ ఆనందాన్ని కనుగొనండి. విషపూరిత వ్యక్తులను మీ జీవితం నుండి తరిమివేయండి. ప్రపంచం ఏమనుకుంటుంది ? అని ముందు ఆలోచించడం మానేయండి. మిమ్మల్ని మీరు సంతోషంగా ఉంచుకోండి. ముందుగా ఇతర విషయాల పట్ల మీ స్పందనను మార్చుకోండి… జీవితంలో సంతోషంగా ఉండేందుకు ఇది ఒక కీలకాంశం. జీవితం పరిమితం… ఈ రోజు, ఈ క్షణం మీరు కోరుకున్న విధంగా జీవించండి’ అని రాసుకొచ్చింది. దీంతో పరిణితి ఇలా పోస్ట్ చేయడానికి కారణం విడాకులు తీసుకోబోతోందా ? అని షాక్ అవుతున్నారు ఆమె ఫ్యాన్స్.

ఆందోళనలో అభిమానులు

పరిణీతి పోస్ట్‌ ను చూశాక అభిమానులు ఆందోళన చెందుతున్నారు. పెళ్లయిన 10 నెలల తర్వాత పరిణీతి ఇలాంటి పోస్ట్ చేయడానికి వెనుక ఉన్న కారణం ఏంటని అడుగుతున్నారు. కొంతమంది ప్రతి ఒక్కరూ జీవితంలో సమస్యలను ఎదుర్కొంటారు అని సర్ది చెబుతుంటే, మరికొంత మంది మాత్రం పెళ్లయ్యాకా పరిణితి బాధపడుతోందా అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి ఆమె పోస్ట్ వెనక ఉన్న సీక్రెట్ ఏంటో పరిణితికే తెలియాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు