Pawan Kalyan: ‘ఓజీ’ కి పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సుజిత్ దర్శకత్వంలో ఓజీ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభమై శరవేగంగా జరుపుకుంటుంది. ముంబైలో తొలి షెడ్యూల్లో ఒక యాక్షన్ సీక్వెన్స్, కీలక సన్నివేశాలకు సంబంధించిన షూట్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే మిగతా పార్ట్ కూడా పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. గ్యాంగ్స్టర్ కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ 3 దశల్లో చూపించనున్నారని సమాచారం. సుజిత్ ఈ సినీమా కోసం భారీ యాక్షన్ సీక్వెన్సెస్ ప్లాన్ చేస్తున్నాడన్న వార్తలొస్తున్న నేపథ్యంలో సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఓజీ సినిమా కోసం పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ గురించి సోషల్ ,మీడియాలో ఒక ఆసక్తికరమైన వార్త హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమా కోసం పవన్ కి దానయ్య సుమారు 100కోట్ల వరకు ఆఫర్ చేశారని సమాచారం అందుతోంది. ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ కేటాయించింది 40రోజుల కాల్షీట్స్ మాత్రమే అయినప్పటికీ ఇంత పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. దీంతో వోజీ సినిమా రైట్స్ కూడా భారీ మొత్తానికి ఫిక్స్ అయ్యే అవకాశం కనిపిస్తోంది.

డిసెంబర్ 22 రిలీజ్ కి సన్నాహాలు చేస్తున్న ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించి ఇటీవలే విడుదలైన గ్లింప్స్ లో సినిమా కథ ఏ రేంజ్ లో ఉండబోతుందో హింట్ ఇచ్చాడు డైరెక్టర్ సుజిత్. పవన్ కళ్యాణ్ లైనప్ లో ఉన్న సినిమాల్లో అన్నిటికంటే ఓజీ సినిమాపైనే అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. మరి, పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అవనున్న ఈ సినిమా ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు